Advertisement

Advertisement


Home > Politics - Political News

దేశరాజకీయాల్లో తప్పుల తడక నేత

దేశరాజకీయాల్లో తప్పుల తడక నేత

ఏరకమైన చరిత్ర తీసుకున్న ఆ చరిత్రలో భిన్న అభిప్రాయాలు చరిత్రపుటల్లో లిఖించబడతాయి. అందులో భారతదేశాన్ని ఏలిన చక్రవర్తులు, రాజులు, సంస్థానాధీశులు, విప్లవకారులు ఇలా ఎవరిని తీసుకున్నా వారికోసం ముందుతరాల వారు తెలుసుకోదగ్గ చరిత్ర ఎప్పటికప్పుడు సిద్ధమవుతునే ఉంటుంది. పేజీలకు పేజీలు ఎటాచ్‌ అయిపోతుంటాయి. భారతదేశంలో ఎందరో మహానుభావులు త్యాగాలు, దీర్ఘకాల పోరాటాలు ఫలితమే పరాయిపాలన నుంచి భారత్‌కు విముక్తి లభించింది. కొన్నివందల మంది యోధాను యోధులు చరిత్రలో ప్రసిద్ధికెక్కి తమకంటూ చరిత్రపుటల్లో కొన్నిపుటలు దక్కించుకున్నారు. వారి గురించి తెలుసుకునే పాతతరం, నేటి నవతరం ఒకింత పులికితలవుతారు. అలాంటి నేపథ్యం నేటి పాలకుల్లో కొంతమందిలో చూడవచ్చు. కానీ, దుష్టపరిపాలకుల కథనాలు చరిత్రలో ఉన్నదున్నట్లే లిఖించబడుతాయి. వారిని సమకాలిన ప్రజలేకాదు, రాబోయేతరం వారు కూడా తూలనాడతారు. ఇలాంటివారు ప్రాచీన చరిత్ర నుంచి నేటి ఆధునిక చరిత్రవరకు కుప్పతెప్పలుగా చరిత్రపుటల్లో నిక్షిప్తమైపోయారు.

ఎంతటి తప్పుడు నేతయినా చరిత్రలో మహోన్నతుడని పించుకోవాలనుకుంటారు. ప్రతిఒక్కరు ఈసడించే హీనచరిత్రలో కలవడానికి ఏ నేత ఇష్టపడడు. అందుకే ఆచితూచి అడుగులు వేయడానికి పాలకుడుగాని, పార్టీల అధ్యక్షులు గాని ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందుకు ప్రభల సాక్షులు దేశసర్వాధికారి అయిన రాష్ట్రపతి, రాష్ట్రమూల విరాట్టు అయిన గవర్నర్‌ తమ విశేష అధికారాలతో నిర్ణయాలను తీసుకునేటప్పుడు ఆచితూచి అడుగులు వేస్తుంటారు. అలా వేసారని వారి చరిత్రలే చెబుతున్నాయి. ఈ ఇద్దరిని ఏపీకే పరిమితమైన నాటి ప్రాంతీయపార్టీ తెలుగుదేశం తమకోసం పెద్దనిర్ణయాన్ని తీసుకోవల్సిందిగా పార్టీ ఇడుములు పాలయినప్పుడు కోరేవారు. ఆనాడు పార్టీ మూలస్థంభం ఎన్‌టీఆర్‌ తనమందితో ఢిల్లీ వెళ్లి ఇందిరాగాంధీ సర్కారుపై రాష్ట్రపతి జైల్‌సింగ్‌కు ఫిర్యాదు చేసారు. ప్రధాని ఇందిరాగాంధీ గవర్నర్‌ రామ్‌లాల్‌ ద్వారా సంఖ్యాబలం ఉన్న నా సర్కారును పడగొట్టించారు. నాకు న్యాయం చేయండని రాష్ట్రపతిని కోరారు. అయితే, ఎన్‌టీఆర్‌ను చూసి జైల్‌సింగ్‌ జాలిపడ్డారు. ఆయన బాధను శాంతం విని అయ్యో! పాపం అనుకున్నారు.

ముఖవల్లికల్లో బాధను వ్యక్తంచేసారు. ఆయన తలచుకుంటే  తిరిగి ఎన్‌టీఆర్‌కు గద్దెనెక్కించగలరు. కానీ, చరిత్రలో ప్రధాని ఇందిరాగాంధీతో ఒక ప్రాంతీయ పార్టీని కుప్పకూల్చిన నేపధ్యంపై విభేదించారనే సంఘటనకు చరిత్రపుటల్లో శ్రీకారం చుట్టలేకపోయారు. ఆ మరుసటిరోజు రాష్ట్రపతిని కలుసుకున్న బర్తరఫ్‌ అయిన ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్‌ వెంటఉండే ఎమ్‌ఎల్‌ఏలను రాష్ట్రపతికి చూపించిన ఫోటోలు అప్పటి మీడియాల్లో వచ్చాయి. ఆఎమ్‌ఎల్‌ఏల్లో కొందరు కారని నకిలీలని కొన్ని పత్రికలు నిగ్గుతేల్చాయి. వాటి క్లిప్పింగ్‌లు ఏపీని అట్టుడికించే ఎన్‌కౌంటర్‌ పత్రిక అచ్చేసింది. పైగా, నిన్నటివరకు 'గవర్నర్‌ మిథ్య, రాష్ట్రపతి మిథ్య' ఆరెండు ఉన్నతపదవులు కేంద్రానికి రబ్బర్‌ స్టాంపులే అని ఎన్‌టీఆర్‌ పదేపదే మాటల దూకుడును కూడా ఉటంకించాయా ఢిల్లీ పత్రికలు. ఇక మలిసంఘటన అదే ఎన్‌టీఆర్‌ ప్రతిపక్షనేతగా హైద్రాబాద్‌ నగరంలో నడిరోడ్డుపై ఫ్యాక్షన్‌ హత్యకు ఓ టీడీపీ ఫ్యాక్షన్‌నేత గురయితే, ఆ శవాన్ని తనమందితో ఎత్తుకుపోయి గవర్నర్‌ ముంగిటపడేసి రాష్ట్రంలో ఫ్యాక్షనిస్టుల వేదికగా పనిచేస్తున్న ఇందిర కాంగ్రెస్‌ సర్కారును డిస్మిస్‌ చేయమని డిమాండ్‌ చేసారు.

తెలుగుదేశం మూలవిరాట్టులైన ఎన్‌టీఆర్‌, చంద్రబాబులు తాము ఏమికోరినా వెంటనే రాష్ట్రపతో, గవర్నరో తీర్చేస్తే ఎలాంటి మిథ్యల్లో ఆరెండు సూపర్‌ పవర్‌ పదవులు ఉండనే ఉండవు. గత రాష్ట్రసర్కారు చంద్రబాబుకు గవర్నర్‌ నరసింహన్‌ కొరకరాని కొయ్యలానే కన్పించేవారు. రాష్ట్రంలో ఏదైనా కీలక నిర్ణయాన్ని గవర్నర్‌తో సంప్రదింపుల సాంప్రదాయాన్ని బాబు ఏమాత్రం పాటించేవారు కాదు. గవర్నర్‌ను అప్పటి ప్రతిపక్షనేత జగన్‌, కలుసుకుంటే గవర్నర్‌పై ఏవగింపుగానే బాబు ఉండేవారు. అప్పటి ప్రధాని మోదీ ఏపీలో వైసీపీ వేగం గురించి కేంద్ర ఇంటిలిజెన్సీ ద్వారా తెలుసుకుని  ఢిల్లీలో వైసీపీకి పెద్దదిక్కుగా ఉన్న విజయసాయిరెడ్డితో చనువుగా ఉండేవారు. దాంతో బాబు ఏకం కేంద్రంతో పొత్తే వదిలేసుకుని మోదీపై తిరుగుబాటు జండా ఎగరవేసి మోదీని దించేద్దామని నానాపార్టీలతో ముఠాలుకట్టారు. ఈ వాస్తవాలన్నీ నేటి భారత రాజకీయ చరిత్రలో పక్కాగా నమోదు అయ్యాయి.

చంద్రబాబు రాజకీయాలపై గ్రంథాలు వెలువడ్డాయి. అవి బాబు కనుసన్నల్లో లిఖించే ఆగ్రంథకర్తలు బాబును ఇంద్రుడు చంద్రుడని ఆకాసానికి ఎత్తేలా రాసి బాబు మెప్పును పలు రకాలుగా పొందేరు. మరోకోణంలో ఉన్నదున్నట్లు రాసే గ్రంథకర్తలు బాబు చేసే కుట్రలు, కూహకాలు, ప్రత్యర్ధులపై బాబు చిమ్మేవిషాన్ని ఒక్కశాతం కూడా వెనక్కిపెట్టరు, విస్మరించరు. ఇలా చంద్రబాబుపై కేంద్రమంత్రి ఉపేంద్ర తన రాజకీయ చరిత్ర తెలియచెప్పే గ్రంథంలో బాబు గురించి ఉన్నదున్నట్లే రాసి సంచలనం సృష్టించారు. టీడీపీ తొలిరోజుల్లో పార్టీలో కీలకవ్యక్తిగా, ఎన్‌టీఆర్‌కు ఇష్టుడుగా ఉపేంద్ర ఉండేవారు. బాబు ఎప్పడయితే టీడీపీలోకి వచ్చారో అప్పటి నుంచి ఉపేంద్ర పార్టీలో ఉన్న విలువలు, బరువు కోల్పోయారు. చివరికి పార్టీని వదలి వెళ్లేపోయేలా బాబు కుట్రలు కోకొల్లలు అని ఉపేంద్ర ఆగ్రంధంలో వివరించారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అసలు సిసలు వ్యవస్థాపకుడు నాదెండ్ల భాస్కరరావు తన రాజకీయజీవిత గ్రంథంలో బాబు కుట్రలను బహిర్గతం చేసారు. అంతవరకు ఎందుకు?

ఎన్‌టీఆర్‌ తెలుగు తెరపై మహనటుడుగా గుర్తింపుపొందారు. ఆయన సిన్మా జీవితంపై పలు గ్రంథాలు వెలువడ్డాయి. అవన్నీ ఎన్‌టీఆర్‌ను ఆహా! ఓహో!! అని చాటాయి. కానీ, ఆయనతో శ్రీకృష్ణవిజయం సిన్మా తీసిన నిర్మాత,కవి, నిర్మొగమాటి అయిన ఎమ్‌ఎస్‌రెడ్డి తనురాసిన బుక్‌లో ఎన్‌టీఆర్‌ చేష్టలను, సాటి నటులపై చూపే చులకనభావం అంతా తేటతెల్లం చేసి తెలుగు సినీ ఇండస్ట్రీని అవును,పక్కానిజమని తలూపిం చేలా చేసుకున్నారు. చంద్రబాబు పిల్లిలా కళ్లుమూసుకుని పాలు తాగాననుకుని ఈమద్య చేస్తున్న నమ్మూనమ్మకపో వంటి రాజకీయ కుట్రలు అన్నీ ఎదురుతిరిగి బహిర్గతం అవుతునే ఉన్నాయి. కృష్ణా వరదల్లో, బాబు చేసిన సర్కారుపై ఆరోపణలన్నీ వరద బాధితులే కాదు పొమ్మన్నారు. పల్నాడు గ్రామాల్లో టీడీపీ అంతః కలహాలలో జరిగే దాడుల్లో పెయిడ్‌ ఆర్టిస్టుల ద్వారా జగన్‌ సర్కారుపై విమర్శలు గుప్పించడం, పులివెందుల పంచాయితీ అని అరిచి గీపెట్టడం ఇవేవి వర్కవుట్‌ కాలేదు. మరోవైపు దాదాపు నాలుగులక్షల ఉద్యోగాలు సీఎం జగన్‌ ఇస్తే అందులో పేపర్‌ లీకులని, పోస్టులు పెద్దఎత్తున అమ్ముకున్నారని ఇలా నోటికివచ్చిన కూతలతో బాబు అండ్‌కో పెట్రేగిపోతునే ఉన్నారు.

పోనీ ప్రతిపక్షం ఇలానే రెచ్చుతుందని సరిపెట్టుకున్నా, బాబు మాటలను నమ్మేజనాలే రువయ్యారు. టీడీపీలోనే బాబు చేస్తున్న ఆరోపణలు నీరుగారుతున్నాయి. బురద ఎవరిమీదైనా చల్లితే అంటుకోవాలి. కానీ, వేసినోళ్ల మీదకే పడుతోంది ఇదేమీ చంద్రన్న తీరు అన్నట్లు చాలావరకు విసుగెత్తిపోతున్నారు. మాజీస్పీకర్‌ కోడెల కుటుంబం అంతులేని అవినీతికి పాల్పడితే, వారిని గాలికి ధూళికి వదిలేసిన బాబు, కోడెల ఆత్మహత్యకు పాల్పడితే దానికి జగన్‌ సర్కారు వేధింపులే కారణమని గగ్గోలుపెడితే జనాలు పట్టించుకోలేదు. జనాలు బాబునే ఈసడించారు. అయినా బాబు పట్టువదలని విక్రమార్కుడులా సోషల్‌ మీడియాలో జగన్‌ సర్కారును కించపరిచేలా పోస్టులు పెట్టిస్తునే ఉన్నారు. బాబు ఓడిన మరుసటి రోజునుంచే జగన్‌  సర్కారుపై తప్పుడు మార్గంలో రణభేరి మ్రోగించడంలో సర్వశక్తులు ఒడ్డడం ఆరంభించారు. అ విశ్రాంత పోరాటకుడుగా తనకు తానే సమర్ధించుకుంటున్నారు. ఇలాగే ప్రతిపక్షం ఉండాలన్నట్లు భుజాలు అదేపనిగా చరుచుకుంటున్నారు.

ప్రతిపక్షనేతగా బాబు మరో నలుగురైదుగురుతో వీరదూకుడు ప్రదర్శనలో ఉన్నారు. తప్పితే టీడీపీలో ఉన్న నేతలంతా జగన్‌ సర్కార్‌పై విరుచుకుపడడంలేదు. అసలు టీడీపీ స్థబ్ధతగా రాష్ట్రమంతా ఉంది. వారిని వెన్నుతట్టి నేనున్నానని ఆ దిశలో బాబు లేనేలేరు. మరోవైపు బీజేపీలో చేరికలు ఆరంభం అయ్యాయి. అందులో టీడీపీవారే ఎక్కువగా ఉరుకుతున్నారు. అందుకు కారణం పార్టీలో ఎవరెలా పోతేం నాకేం అన్నట్లే బాబు హీన రాజకీయాలకు పలువురు తలలు పట్టుకుంటున్నారు. పలుకేసుల్లో నిర్విరామంగా అరెస్టుమీద అరెస్టు అవుతున్న మాజీ ఎంఎల్‌ఏ చింతమనేని గురించి బాబు పట్టించుకోవడం లేదు. అలాగే, మాజీవిప్‌ కూన రవికుమార్‌ అధికారిపై దూషించిన కేసులో ముందస్తు బెయిల్‌ కోసం అజ్ఞాతంలో గడిపి బెయిల్‌పొందాక హమ్మయ్యా అనుకున్నారే తప్ప చంద్రబాబు నుంచి నేనున్నాననే ఫోన్‌కాలే కరువయ్యింది. బాబు తీరు టీడీపీలో ప్రతిఒక్కరికి తెలుసు. బాబుచూపే నిరాధరణ అంతాఇంతా కాదని వారికి తెలియంది కాదు. పైగా, రోజు రోజుకు బాబు కొత్తసర్కారుపై పెట్రేగుతున్నతీరు కూడా పార్టీని వెనుకడుగులు వేయిస్తోంది. తప్పితే, ముందుకు దూసుకువెళ్లేలా చేయడంలేదు.

ఇప్పుడు బాబు పెయిడ్‌ జర్నలిస్టులతో సోషల్‌ మీడియా పోస్టులు కూడా పార్టీకి తలవంపుల్లానే పరిణమించాయి. వాటిపై పోలీసులు నిఘా పెట్టినట్లు తెలుసుకున్న టీడీపీ క్యాడర్‌ బాబు ప్రజల్లో మరోసారి అభాసుకానున్నారని చివుక్కుమంటున్నారు. పెద్ద వయస్సులో కూడా పెద్దరికంతో లేరని ఇలాంటి నేత వెనుక ఏమని నడవగలమని పక్కపార్టీ ల్లోకి వలసబాట పడుతున్నారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలన ఒకతీరుగా ఉండేది. ఆయన రాజకీయాల్లో తలపండినందున ప్రతిపక్షాన్ని ఏమేరకు చూడాలో అంతవరకే చూసేవారు. తనకు ముందు ఏలిన చంద్రబాబు పాలనలో భూతద్దంతో ఏమేరకు హాంఫట్‌ చేసారని వెతుకు లాటలు జరుపలేదు. కానీ, జగన్‌ సీఎంగా తొలిరోజు నుంచే బాబు తనముందు ఐదేళ్లపాలనలో జరిగిన అంతులేని అవినీతిపై చాపకిందనీరులా విచారణలు జరిపిస్తునే ఉన్నారు. అందుకు కారణం తను పాదయాత్రలో బాబు అవినీతి కుండను ఎప్పటికప్పుడే ప్రజల సమక్షంలో బద్దలు చేసేవారు. అలా ఆరోపణలు చేయడమేకాదు, నిరూపించాలని దృఢచిత్తుడయ్యారు.

బాబు వేలకోట్ల అవినీతి ఏక్షణమైనా బహిర్గతం కానున్నాయి అని వైకాపా మంత్రులే కోడైకూస్తున్నారు. మరోవైపు జగన్‌ తను ఇచ్చిన వందలాది హామీలను జనాల్లో పప్పుబెల్లాలు పంచినట్లు పంచడానికే సమయం వెచ్చిస్తున్నారు. జగన్‌ బాబుపై గుప్పెడు కేసులు ఎప్పుడు పెడతారా అని మోదీసాబ్‌ ఏపీవైపు ఖాళీ ఉన్నప్పుడల్లా ఆత్రంగా చూస్తునే ఉన్నారు. ఎందుకంటే మోదీని గడచిన ఎన్నికల్లో నిద్రపోకుండా చేసిన చంద్రబాబును ఆయన మన్నించలేకపోతున్నారు. కుటుంబమే లేని మోదీని ఓడించి, ఇంట్లో కూర్చోబెడతాను అనే బాబు శూలంపోటు మాటలు విదేశయానంలో కూడా మోదీ చెవుల్లో గింగురుమంటున్నాయి. బీజేపీయే లేని ఏపీకి నిధులు ఇచ్చి అక్కడ ఏలుతున్న ప్రాంతీయపార్టీ వైకాపాను ఎందుకు ప్రోత్సహించాలి? అని బిర్రబిగుసుకున్న మోదీ ఏపీకి నిధులు ఇచ్చేది ఎప్పుడంటే గుప్పెడు అవినీతికేసులు బాబు నెత్తికెత్తి కోర్టుబోనులో నిలిపినప్పుడే అన్నట్లు ఉన్నారని రాజకీయముదుర్లు ఎప్పుడో ఊహించేసారు.

తెరమీద నీతులు.. తెర వెనుక బ్లాక్ మెయిలింగ్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?