Advertisement

Advertisement


Home > Politics - Political News

అభివృద్ధి అంటూ గావుకేకలు పెట్టినా...

అభివృద్ధి అంటూ గావుకేకలు పెట్టినా...

అభివృద్ధి జరగాల్సిందే. నిన్నటికీ నేటికీ స్పష్టంగా తేడా తెలియాల్సిందే. మరి అబివృద్ధి అంటూ గావు కేకలు పెడితే సరిపోదు కదా. కానీ బీజేపీ పెద్దలు మాత్రం పుణ్యం అంతా తమ ఖాతాలో, పాపాలన్నీ వేరే ఖాతాల్లో వేస్తున్నారులా ఉంది.

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఉత్తరాంధ్రా అభివృద్ధి మీద గట్టిగానే మాట్లాడుతున్నారు. ఎక్కడ ప్రగతి గతి అని కూడా ఆయన నిలదీస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక మాట అన్నారు. 

2018 నాటికే ఉత్తారాంధ్రా జిల్లాలు బాగా వెనకబడి ఉన్నాయని నివేదికలు తేల్చాయని. మరి విభజన చట్టంలో పేర్కొన్న వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలను కేంద్రం ఎందుకు ప్రకటించలేదో జీవీఎల్ చెప్పగలరా అని ఉత్తరాంధ్రా మేధావులు ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు వెనకబడిన జిల్లాలకు ఏటా యాభై కోట్లు ఇచ్చే స్కీమ్ ని కూడా కేంద్రం ఆపేసిందని జీవీఎల్ గుర్తించాలని సూచిస్తున్నారు.

ఇక టీడీపీ, బీజేపీ కలసి నాడు ఏపీలో కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపారని, అపుడు ఉత్తరాంధ్రా వెనకబాటుతనం జ్ఞప్తికి రాలేదా అని అంటున్నారు. ఏది ఏమైనా కేంద్రం ఇచ్చే నిధులతోనే ఏపీ పాలన సాగుతోంది అని పదే పదే జీవీఎల్ అనడం పట్ల కూడా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. 

కేంద్రం కూడా ప్రజల పన్నుల నుంచే కదా నిధులు సమకూర్చుకునేది అన్నది బీజేపీ ఎంపీ గమనించాలని అంటున్నారు. ఇక సినిమా టికెట్లను ఆన్ లైన్ లో పెట్టి అమ్మకం చేయాలన్న ప్రభుత్వం నిర్ణయం పట్ల కూడా జీవీఎల్ సెటైర్లు వేస్తున్నారు.

ప్రభుత్వమే ఇక మీదట సినిమా తీస్తుందేమో అని ఆయన అంటున్నారు. ఇదే సమయంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాత్రం వైసీపీ నిర్ణయాన్ని సపోర్ట్ చేశారు. మొత్తానికి చూస్తే వైసీపీ సర్కార్ మీద విమర్శలు చేయాలన్న అతి ఉత్సాహంలో ఉన్న బీజేపీ పెద్దలు అందులో కొంత ఏపీకి మేలు చేయాలన్న దాని మీద పెడితే రాష్ట్రం బాగుంటుంది కదా అన్న సూచనలు వస్తున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?