cloudfront

Advertisement


Home > Politics - Political News

మొన్న 'చంద్రబాబే ప్రధాని' అన్నారు, ఇప్పుడేమో!

మొన్న 'చంద్రబాబే ప్రధాని' అన్నారు, ఇప్పుడేమో!

పోటీ చేస్తున్నది పట్టుమని పది సీట్లకు కూడా కాదు కానీ, ప్రధానమంత్రిగా ఎవరుండాలనే అంశం మీద జేడీఎస్ వాళ్ల కామెంట్లకు హద్దులేకుండా పోతోంది. ముందుగా జేడీఎస్ నేత కుమారస్వామి ఆ మధ్య మాట్లాడుతూ.. తన తండ్రి దేవేగౌడను మళ్లీ ప్రధానిగా చేసే విషయమై కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలని చెప్పుకొచ్చారు. 'దేవేగౌడను ఏకగ్రీవంగా ప్రధానిగా చేయాలి..'అంటూ కుమారస్వామి స్టేట్ మెంట్ ఇచ్చారు కూడా!

ఎప్పుడో ఏదో జాక్ పాట్ గా ఆయన పీఎం అయిన విషయాన్ని పట్టుకుని మళ్లీ అలాగే జరగాలని వారు కోరారు. అయితే ఆ తర్వాత ఏపీకి ఎన్నికల ప్రచారానికి వచ్చిన దేవేగౌడ ఆ తరహాలోనే మళ్లీ కామెడీ చేశారు. 'చంద్రబాబు నాయుడు ప్రధాని కావొచ్చు..' అని దేవేగౌడ అన్నారు. ఆయన చేసిన ఆ ప్రహసనపు ప్రకటనను బాబు అనుకూల మీడియా పతాక శీర్షికల్లో అచ్చేసుకుని అనందపడింది.

కట్ చేస్తే ఇప్పుడు దేవేగౌడ మళ్లీ మరోమాట చెప్పారు. 'రాహుల్ ప్రధానమంత్రి కావాలి..' అని అన్నారు. ఇలా జేడీఎస్ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి మారిపోయారు. ముందుగా దేవేగౌడనే ప్రధాని అన్నారు, మళ్లీ చంద్రబాబు పేరును తెచ్చారాయన, ఇప్పుడు మళ్లీ రాహుల్ కే మద్దతు అని దేవేగౌడ ప్రకటించారు.

ఇలా సాగుతున్నాయి జేడీఎస్ ముచ్చట్లు. ఏపీకి ప్రచారానికి వచ్చి చంద్రబాబును మునగమాను ఎక్కించి దేవేగౌడ ఇప్పుడు మళ్లీ రాహుల్ ను ఎక్కిస్తున్నాడు. ఎన్నికల ముందు ఒకవైపు, ఎన్నికలు అయిన తర్వాత మరోవైపు ఉండే దేవేగౌడ ఇలా తన స్టైల్ కామెడీ చేస్తున్నారు!

మాస్ పెట్టుకుని స్టైల్ గా చేస్తే మస్తు ఎంజాయ్