cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

అధికారులకు అంత పంతమెందుకు..?

అధికారులకు అంత పంతమెందుకు..?

పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టుంది ఏపీ-తెలంగాణ ఆర్టీసీల పరిస్థితి. లాభం మీకు ఎక్కువ వస్తోంది అంటే, మీకే ఎక్కువ వస్తోంది అంటూ రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు ఆర్టీసీ బస్సుల విషయంలో గొడవలు పడుతున్నారు. తాజాగా అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసుల విషయంలో మరోసారి చర్చలు విఫలం అయ్యాయి.

సర్వీసుల విషయంలో సమానత పాటించాలని ఒకరు, కిలోమీటర్ల విషయంలో సర్దుకుపోదామని ఒకరు తేల్చి చెప్పడంతో మళ్లీ ఈ వ్యవహారం వాయిదా పడింది. ఈ పంతాలకు మధ్యలో ప్రయాణికులు నలిగిపోతున్నారు. ప్రైవేట్ వాహనాలు లాభపడుతున్నాయి. ఆర్టీసీకి ఆర్థిక నష్టంతో పాటు, బస్సులు తుప్పుపట్టిపోతున్నాయి.

అంతర్ రాష్ట్ర సర్వీసుల విషయంలో తుది నిర్ణయం మీదేనంటూ కేంద్రం తేల్చి చెప్పడంతోనే అసలు చిక్కు వచ్చిపడింది. మిగతా రాష్ట్రాలకు బస్సులు పంపిస్తున్నా.. తెలంగాణలో మాత్రం ఏపీఎస్ఆర్టీసీ చక్రం మోపలేకపోయింది. అటు తెలంగాణ బస్సులు కూడా రాష్ట్రంలోకి రాలేకపోతున్నాయి. అన్ లాక్ తర్వాత చాలామంది ప్రజలు అటు, ఇటు వెళ్లడానికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

రాష్ట్రాల సరిహద్దుల్లో బస్సులు దిగి, అక్కడినుంచి ప్రైవేట్ వాహనాల్లో రాష్ట్రం సరిహద్దు దాటి.. ప్రయాణాలు సాగించాల్సిన పరిస్థితి. ఉన్నత వర్గాలు వ్యక్తిగత వాహనాలు వినియోగించుకుంటుంటే.. పేద, మధ్యతరగతి వారు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని అయినా రెండు తెలుగు రాష్ట్రాలు సామరస్య పూర్వకంగా ముందుకు పోవాలి. ఇలా గొడవలు పడితే.. రెండు ఆర్టీసీలకు ఆదాయం లేకుండా కూర్చోవాల్సి వస్తోంది.

సిబ్బందికి జీతాలు సకాలంలో చెల్లిస్తున్నారు, మరి వారితో పనిచేయించుకోడానికి ఇబ్బంది ఏంటి? షెడ్డుల్లో మూలుగుతున్న బస్సులను బైటకు తెచ్చి వదిలితే.. కనీస ఆదాయం అయినా వస్తుంది కదా? మరోసారి చర్చిస్తామంటూ ఎవరి దారిన వారు చక్కాపోయిన అధికారులు ఇకనైనా ప్రజల కష్టాల అర్థం చేసుకోవాలి. ఈ విషయంలో ముఖ్యమంత్రులు ఎఁత త్వరగా జోక్యం చేసుకుంటే, ఇటు ప్రజలకు, అటు ఆర్టీసీలకు అంత మేలు.

నాగ‌బాబూ ...మ‌రీ ఇంత దిగ‌జారుడేంది?

 


×