Advertisement

Advertisement


Home > Politics - Political News

బ్రేకింగ్‌ : దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌

బ్రేకింగ్‌ : దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌

మీడియాకు పొక్కకుండా కోర్టు ఆదేశాల మేరకు నలుగురు నిందితుల్ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఘటన ఎలా జరిగిందనే విషయాన్ని తెలుసుకునేందుకు నిందితుల్ని చటాన్ పల్లి, షాద్ నగర్ ప్రాంతాలకు తీసుకెళ్లారు. ఏం చేశారు, ఎలా చేశారనే విషయాల్ని నలుగురు నిందితులు పూసగుచ్చినట్టు వెల్లడించారు. ఏ చిన్న అంశాన్ని వదలకుండా ప్రతి డీటెయిల్ ను పోలీసులు అడిగి తెలుసుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఘటన ఎలా జరిగిందనే విషయాన్ని మరోసారి కళ్లకుకట్టారు.

అంతేకాదు, ఈ మొత్తం వ్యవహారాన్ని పోలీసులు షూట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో అతి తక్కువ మంది పోలీసులు (నలుగురు లేదా ఐదుగురు మాత్రమే) పాల్గొన్నారు. సీన్ రీక్రియేషన్ లో భాగంగా దిశ వాడిన సెల్ ఫోన్ ఎక్కడుందో కనిబెట్టారు పోలీసులు. భూమిలో పాతిపెట్టిన ఫోన్ ను నిందితులతోనే బయటకు తీయించారు. సెల్ ఫోన్ లో సిమ్ ను దిశ మృతదేహంతో పాటు తగలబెట్టినట్టు ఈ సందర్భంగా నిందితులు తెలిపారు.

జరిగిన ఘటనలో ఎవరి ప్రమేయం ఎంతనే విషయాన్ని కూడా పోలీసులు కూపీ లాగారు. దాదాపు 4 గంటల పాటు జరిగిన ఘటనలో ఆరిఫ్ ఏం చేశాడు? నవీన్, శివ, చెన్నకేశవులు ఏం చేశారనే విషయాన్ని పోలీసులు కూపీ లాగారు. నిందితులు వాడిన లారీ నుంచి కూడా మరోసారి శాంపిల్స్ సేకరించారు.

ఇదంతా జరిగిన కొన్ని గంటలకే నిందితులు నలుగురు ఎన్ కౌంటర్ అయ్యారు. ఘటనా స్థలం నుంచి పారిపోవడానికి ప్రయత్నించడంతో కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఎన్ కౌంటర్ విషయాన్ని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ధృవీకరించారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?