cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

మా బిడ్డకు న్యాయం జరిగింది: దిశ తల్లిదండ్రులు

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.  దిశ‌ని కాల్చిన చోటే నిందితులని ఎన్‌కౌంట‌ర్ చేయ‌డంతో  తమ బిడ్డకు తగిన న్యాయం జరిగిందని, నిందితులకు తగిన శిక్ష పడిందని అభిప్రాయపడ్డారు.

మరోవైపు ఎన్‌కౌంటర్‌ జరిగిన సమాచారం తెలుసుకుని ... సంఘటనా స్థలానికి  స్థానికులు భారీగా తరలి వస్తున్నారు. చటాన్‌పల్లి బ్రిడ్జ్‌ వద్దకు చేరుకున్న స్థానికులు...పోలీసులు జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసి మంచి పని చేశారంటూ పోలీసులు, ముఖ్యమంత్రికి  కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజల అభిప్రాయాన్నే పోలీసులు అమలు చేశారని అభిప్రాయపడ్డారు. సీఎం జిందాబాద్‌, పోలీసులు జిందాబాద్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 

 


×