Advertisement

Advertisement


Home > Politics - Political News

మానవ మృగాలకు మటన్ భోజనం

మానవ మృగాలకు మటన్ భోజనం

ఓవైపు దిశా హత్యకేసుపై దేశమంతా అట్టుడికిపోతోంది. వాళ్లను బహిరంగంగా ఉరి తీయాలంటూ ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కాదు, ఫాస్ట్ జడ్జిమెంట్ కావాలంటూ నినాదాలు చేస్తున్నారు. ఇటు లోక్ సభ, అటు రాజ్యసభలో కూడా దీనిపైనే నడిచింది. దేశమంతా ఇంతగా రగిలిపోతుంటే.. ఈ నీచానికి కారణమైన ఆ నలుగురు కిరాకతులు జైలులో హ్యాపీగా ఉన్నారు. అంతేకాదు.. ఎంచక్కా నాన్-వెజ్ భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నారు.

చర్లపల్లి జైలులో ఉన్న దిశా హత్యకేసు నిందితులు నలుగురూ ఆదివారం ఉదయం బ్రేక్-ఫాస్ట్ కింద పులిహోర తిన్నారు. మధ్యాహ్నం అన్నం, పప్పు, కూర తిన్నారు. రాత్రికి ఏకంగా మాంసాహార భోజనం ఆరగించారు. జైలు నిబంధనల ప్రకారం ఆదివారాల్లో ఖైదీలకు మటన్ ఇస్తారు. అలా జైలులోకి వచ్చిన మొదటి రోజే వీళ్లకు మటన్ మీల్స్ లభించింది. ఇవి కాకుండా మధ్యలో 2 సార్లు టీ కూడా తాగారు. ఇళ్లల్లో కూడా వీళ్లకు ఇలాంటి సౌకర్యాలు ఉండవేమో అంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి ప్రజాసంఘాలు.

చర్లపల్లి జైలులో కట్టుదిట్టమైన భద్రత మధ్య వీళ్లను ఉంచారు. ఒకరితో ఒకర్ని కలవనీయకుండా నలుగురికి నాలుగు ప్రత్యేక సెల్స్ కేటాయించారు. పరిటాల రవి హత్యకేసులో నిందితుడిగా ఉన్న మొద్దుశీను చంపిన ఓంప్రకాష్ ను ఏ గదిలో ఉంచారో.. ప్రధాన నిందితుడు ఆరిఫ్ ను ఆ గదిలోనే ఉంచాను.

ఇక నలుగుర్లో ఒకడైన చెన్నకేశవులు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఇతడికి వైద్యం కూడా అందించడానికి రెడీ అవుతున్నారు పోలీసులు. ఇలా భోజనం పెడుతూ, వైద్యం అందిస్తూ ఎన్నాళ్లు కాలయాపన చేస్తారని ప్రశ్నిస్తున్నాయి స్వచ్చంధ సంస్థలు. ఇటు రాజ్యసభలో కూడా దాదాపు ఇదే వాదన వినిపించింది.

మరోవైపు ఈ కేసుకు సంబంధించి మరిన్ని సాక్ష్యాధారాల్ని సేకరించారు పోలీసులు. నిందితులు ఎట్టిపరిస్థితుల్లో తప్పించుకోవడానికి వీల్లేకుండా, సాక్ష్యాలు సేకరిస్తున్నారు. కేసు తీవ్రత కారణంగా వీళ్లకు మరణశిక్ష విధించే అవకాశం ఉంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?