cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

టీడీపీ వదిలిన బాణం వారికే గుచ్చుకుందా?

టీడీపీ వదిలిన బాణం వారికే గుచ్చుకుందా?

తెలుగుదేశం పార్టీని మహా నటుడు ఎన్టీ రామారావు స్థాపించారు. ఆయన సినిమాల్లో నటుడే కానీ నిజ జీవితంలో మాత్రం ఒక పధ్ధతిగా ఉండేవారు. అందుకే ఆయన జమానాలో పార్టీ సర్వ‌జనామోదమైంది. ఇక అల్లుడు చంద్రబాబు నాయకత్వాన టీడీపీ పూర్తిగా గాడి తప్పిందన్న విమర్శలు సొంత పార్టీ నుంచే ఎపుడూ ఉంటాయి. నా కంటే అల్లుడే మహా నటుడు అని అన్న గారు ఏనాడో సర్టిఫికేట్ ఇచ్చేశాక ఆయన నాయకత్వంలోని టీడీపీ కూడా అదే పద్ధతిలో పోతోందని వైసీపీ నేతలు అంటున్నారంటే తప్పు లేదుగా. దానికి ఎన్నో ఉదాహరణలు  ఉన్నాయి.

తాజాగా నర్శీపట్నంలో ఏరియా ఆసుపత్రిలో పనిచేసే ఓ ప్రభుత్వ డాక్టర్ గారికి గుస్సా వచ్చింది. ఆయన వెంటనే మీడియా ముందుకు వచ్చేసి ఏకంగా జగన్ ప్రభుత్వంపైనే విమర్శలు జోరుగా చేశారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఇంతలా అదే  ప్రభుత్వం మీద విమర్శలు చేయడం సర్వీస్ నిబంధనలకు విరుధ్ధం. అయినా సరే ఆ డాక్టర్ గారు ఓ లెక్కన రెచ్చిపొయారు. కరోనా విషయంలో ప్రభుత్వానికి సీరియస్ నెస్ లేదని,  పైగా వైద్యులకు ఎటువంటి పరికరాలు ఇవ్వలేదని,  వారికి కనీసం మాస్కులు కూడా ఇవ్వలేదని ఘాటైన ఆరోపణలు చేశారు. ఇవన్నీ ఇలా ఉంటే ఇంతకీ ఆ డాక్టర్ గారు చెబుతున్నా ఆసుపత్రిలో అన్ని రకాలైన  వైద్య పరికరాలు సిధ్ధం చేసి ఉంచామని ఉన్నతస్థాయి వైద్యాధికారులు చెబుతున్నారు. పైగా అది కోవిద్ 19 ఆసుపత్రి కానే కాదని తేల్చేశారు.

మరి నిజాలు ఇలా ఉంటే ఆ డాక్టర్ గారు అంతలా తెగించి వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి కారణమేంటంటే ఆయన గారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి సన్నిహితుడట. ఆయన వదిలిన రాజకీయ బాణమని నర్శీపట్నం వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ అంటున్నారు. క‌రోనా లాంటి  మహమ్మారి పొంచి ఉన్న ఈ దశలో ఇలాంటి చీప్  ట్రిక్స్ తో ప్రజలను గందరగోళం చేయడం దారుణమని వైసీపీ ఎమ్మెల్యే ఉమా శంకర్ అంటున్నారు. మరో వైపు ఇదే విషయం మీద మంత్రి పేర్ని నాని కూడా స్పందిస్తూ ఆయన డాక్టరా, యాక్టరా అనేశారు.

చంద్రబాబు ఎక్కడో  హైదరాబాద్ లో కూర్చుని ఇలాంటి నాటకాలను  తనకు అనుకూలురైన వారి చేత ఆడిస్తున్నారని కూడా గట్టిగా తగులుకున్నారు. మొత్తం మీద వైసీపీ నేతలు తొందరగానే ఈ గుట్టుని రట్టు చేయడంతో  టీడీపీ రాజకీయ బాణం వెనక్కి వెళ్ళి వారికే గుచ్చుకుంది మరి.  ఇంత జరిగినా కూడా   తమ్ముళ్ళు మరిన్ని రాజకీయ  బాణాలు వదలరని ఇప్పటికైతే ఏ గ్యారంటీ లేదుగా.

బన్నీ బర్త్ డే గిఫ్ట్ అదిరిందిగా