
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దని, ప్రజలను రెచ్చగొట్టొద్దని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హెచ్చరికతో కూడిన విజ్ఞప్తి చేశారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు సామాజిక బాధ్యతతో మెలగాలని ఆయన హితవు పలికారు.
సంక్రాంతి పండగ కానుకగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అందజేసిన సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌పై దాడి చేస్తామని, కేసీఆర్‌ను రాజకీయ సమాధి చేయడమే లక్ష్యమని బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేయడంపై మంత్రి ఎర్రబెల్లి తీవ్రంగా స్పందించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంపై గౌరవం పెరిగేలా మాటలు, విమర్శలు ఉంటే ప్రజలు హర్షిస్తారన్నారు.
బండి సంజయ్ మాటలు ప్రజలను, వారి మనోభావాలను, సెంటిమెంట్లను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఎర్రబెల్లి అభిప్రాయపడ్డారు. నేతల మాటలనే కాక, పార్టీల పద్ధతులను, ప్రభుత్వాల అభివృద్ధి తీరును కూడా ప్రజలు గమనిస్తున్నారని మంత్రి చెప్పుకొచ్చారు.
గవర్నర్ దత్తాత్రేయను కలిసిన సీఎం జగన్