Advertisement

Advertisement


Home > Politics - Political News

టోనీ దొరికాడు.. ఆ ప్రముఖుల పేర్లు బయటకొస్తాయా?

టోనీ దొరికాడు.. ఆ ప్రముఖుల పేర్లు బయటకొస్తాయా?

గతంలో హైదరాబాద్ కేంద్రంగా సాగిన డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో తెలుగు సినీ ప్రముఖులు కొంతమంది పోలీస్ విచారణ ఎదుర్కొన్నారు. వీరిలో పెద్ద కుటుంబాలవారు ఉన్నారు, చిన్న హీరోలు కూడా ఉన్నారు. అప్పట్లో వీరిపై తీవ్రమైన ట్రోలింగ్ జరిగింది. సోషల్ మీడియా మొత్తం వీరికి వ్యతిరేకంగా కోడై కూసింది. అయితే కొండంత రాగం తీసి తుస్సుమనిపించినట్టు విచారణ పేరుతో అందర్నీ పిలిపించి చివరకు ఎవరికీ ఏ సంబంధం లేదన్నారు పోలీసులు. ఆ తర్వాత డ్రగ్స్ విచారణ కేసు మరుగునపడిపోయింది. 

ఇటీవల తెలంగాణ మంత్రి కేటీఆర్ పేరుని, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డ్రగ్స్ మాఫియాతో లింకు ఉన్నట్టు ప్రస్తావించి మరోసారి ఆ వ్యవహారాన్ని హైలెట్ చేశారు. ఆ తర్వాత కోర్టుజోక్యంతో రేవంత్ రెడ్డి నోటికి తాళం పడినా.. సగటు సినిమా అభిమానికి, ప్రజలకు మాత్రం టాలీవుడ్ తో డ్రగ్స్ రాకెట్ కి ఉన్న సంబంధాలు సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలాయి.

టోనీ అరెస్ట్..

డ్రగ్స్ మాఫియా కేసులో ప్రధాన నిందితుడు టోనీని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలో అతడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు, హైదరాబాద్ కి కూడా తీసుకొచ్చారు. వీసా గడువు ముగిసినా ముంబైలోనే ఉంటున్న టోనీని అరెస్ట్ చేసినట్టు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటించారు.

ఎవరా సంపన్నులు..?

అయితే టోనీ అరెస్ట్ తర్వాత అతడితో సంబంధాలున్న సంపన్నుల లిస్ట్ ప్రకటిస్తారని అనుకున్నారంతా. అయితే ఆ లిస్ట్ లోని 13మంది సంపన్నులలో 9మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు సీవీ ఆనంద్. టోనీతో సంబంధాలు పెట్టుకుని వీరు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారని, వినియోగిస్తున్నారని తెలిపారు. డ్రగ్స్ వినియోగిస్తున్న వారి విషయంలో వారిని బాధితులుగా గుర్తించాలా, లేక నిందితులుగా వారి పేర్లు చార్జ్ షీట్ లో చేర్చాలా అనే విషయంలో న్యాయనిపుణుల సలహా తీసుకుంటున్నారు పోలీసులు.

ఈ నేపథ్యంలో సంపన్నులు, సినిమావాళ్లు ఒకటేనా, లేక వేర్వేరుగా ఉన్నారా..? అసలా సంపన్నుల వివరాలేంటి..? సినిమావాళ్లను బాధితులుగా చూపించి కేసు తీవ్రత తగ్గిస్తారా అనేది ముందు ముందు తేలాల్సిన విషయం. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?