cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

సందడి లేని పరిషత్ సంబరం..

సందడి లేని పరిషత్ సంబరం..

సహజంగా ఎన్నిక ఏదైనా.. ఉదయాన్నే పోలింగ్ బూత్ ల ముందు ఓటర్లు బారులు తీరారు అని అంటుంటారు. కానీ ఈసారి ఏపీలో జరుగుతున్న పరిషత్ ఎన్నికల్లో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఒక్కొక్కరే వస్తున్నారు, ఓటు వేసి వెళ్తున్నారు, కనీసం క్యూ లైన్లు కూడా ఎక్కడా కనిపించడం లేదు. ఉదయాన్నే పోలింగ్ మొదలైనా ఎక్కడా ఓటర్ల బారులు అనే మాటే లేదు. పరిషత్ ఎన్నికలు జరుగుతున్నాయనే మాటే కానీ, గ్రామాల్లో ఆ సందడి కనిపించడం లేదు.

పరిషత్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు, ఉప సంహరణలు, ఏకగ్రీవాలు అన్నీ ఏడాది క్రితమే ముగిశాయి. ఇప్పుడు కేవలం ఓటింగ్ మాత్రమే జరుగుతోంది. ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు టీడీపీ ప్రకటించడంతో ఆ పార్టీ అభ్యర్థులు ప్రచారానికి కూడా రాలేదు. దీంతో అధికార పక్షం తరపున కూడా ప్రచార పర్వం అనుకున్నంత ఊపు తీసుకు రాలేదు, మిగతా పార్టీల పరిస్థితి సరే సరి. 

అందరూ ప్రచారాన్ని లైట్ తీసుకున్నారు. ఏదో ప్రచార వాహనాలు నడిపి పని కానిచ్చారు కానీ, ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించడం ఈసారి కనిపించలేదు. దీంతో సహజంగానే పోలింగ్ ప్రక్రియ మందకొడిగా మొదలై, మందకొడిగానే సాగుతోంది.

టీడీపీకి ఏజెంట్లు కరువు..ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు టీడీపీ ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీ అభ్యర్థులు పూర్తిగా డైలమాలో పడ్డారు. కొన్నిచోట్ల పోటీకి ధైర్యం చేసినా.. ఆ పార్టీ తరపున పోలింగ్ కేంద్రాల్లో కూర్చునేందుకు ఏజెంట్లు కూడా కరువయ్యారు. పోటీ చేసినా ఫలితం ఏంటో తెలుసు కాబట్టే.. టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈ ఎన్నికలకు దూరంగా ఉండిపోయారు.

కోర్టు తీర్పులతో మరింత కన్ఫ్యూజన్..మంగళవారం సాయంత్రానికి ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఆగిపోయాయి అనేది ప్రధాన వార్త. అయితే ఎన్నికల కమిషన్ డివిజన్ బెంచ్ ని ఆశ్రయించడం, ఇరు పక్షాల వాదనలు వినడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. చివరకు బుధవారం మధ్యాహ్నం వరకు ఎడతెగని ఉత్కంఠ కొనసాగింది. ఎన్నికల సామగ్రి తీసుకెళ్లడానికి వచ్చిన సిబ్బంది కూడా కోర్టు తీర్పు కోసం ఎంపీడీవో ఆఫీస్ ల ముందు పడిగాపులు కాశారు. 

ఈ నేపథ్యంలో ఎన్నికలు యథావిధిగా జరుగుతున్నాయనే విషయం ఇంకా జనాల్లోకి వెళ్లలేదని అర్థమవుతోంది. కారణాలేవైనా.. ఈ దఫా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం 50ని చేరుకోవడం కూడా కష్టమేనంటున్నారు. 

పవన్ కళ్యాణ్ కి రెస్పెక్ట్ తీసుకొచ్చే సినిమా

నా పుట్టినరోజున లాహే లాహే పాట పాడాను

 


×