cloudfront

Advertisement


Home > Politics - Political News

ఈ పుకార్లకు పార్లమెంటే ఫుల్‌స్టాప్‌ పెట్టాలి!

ఈ పుకార్లకు పార్లమెంటే ఫుల్‌స్టాప్‌ పెట్టాలి!

దేశంలో చాలా వ్యవస్థల మీద నమ్మకం లేకుండాపోతోంది. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు తమ పనులను తాము సవ్యంగా చేయడం లేదనే విషయం భారతీయులకు తెలియనిది ఏమీకాదు. ఏ వ్యవస్థను అయినా మనుషులే నడుపుతారు కదా.. మనుషులకు అన్ని జాడ్యాలూ ఉంటాయి కదా, అందుకే వ్యవస్థలు కూడా సక్రమంగా పనిచేస్తాయని ఆశించడం తప్పైపోతోంది. అయితే ఈ జాడ్యాలు మన దేశానికే ఉండటం దురదృష్టకరం. ప్రపంచ దేశాలన్నింటిలోనూ ప్రభుత్వాలను, ప్రజాసంబంధ వ్యవస్థలనూ మనుషులే నడుపుతున్నారు. అయితే అక్కడ మాత్రం చాలావరకూ వ్యవస్థలు సవ్యంగా పనిచేస్తూ ఉంటాయి. ఇండియాలో ఇంతే అనుకోవాలి.

గత దశాబ్దంలోనే వ్యవస్థ తీసుకున్న అతి చెత్త నిర్ణయాల్లో ఒకటి నోట్లరద్దు. ఈ రద్దు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా దాని దుష్ఫలితాలు మాత్రం ఎవ్వరూ మరిచిపోలేరు. నెలల తరబడి ప్రజలను బ్యాంకుల ముందు క్యూల్లో నిలబెట్టిన మోడీ నిర్ణతయం ప్రభావం ఇంకా కొనసాగుతూ ఉంది. చాలామంది ఆర్థికవేత్తలు ఇదేమాట చెబుతున్నారు. నోట్లరద్దు అత్యంత చెత్త నిర్ణయమని వారు అభిప్రాయపడుతూ ఉంటారు. ఏదో ప్రయత్నం చేశారు, అది మిస్‌ఫైర్‌ అయ్యింది అనే విషయాన్ని ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు ఒప్పుకోవడం లేదు. ఒప్పుకుంటే వాళ్లది చిన్నతనం అవుతుందనే భయం.

నోట్లరద్దు మంచి ఫలితాలను ఇచ్చిందన్నట్టుగానే మాట్లాడుతూ ఉంటారు. ఆ సంగతేమో కానీ.. ఇప్పుడు మళ్లీ ప్రజల్లో కొత్తమాట వినిపిస్తోంది. కొత్త పుకార్లు షికారు చేస్తున్నాయి. త్వరలోనే రెండువేల రూపాయల నోటు రద్దు అయిపోతోంది అని. ఇలాంటి చెత్త వార్తలను వైరల్‌ చేయడానికి సోషల్‌ మీడియా ఉండనే ఉంది. వ్యూసే లక్ష్యంగా చెత్తనంతా వైరల్‌ చేసే యూట్యూబ్‌ చానళ్లు ఈ పని తీవ్రంగా చేస్తున్నాయి. ఈ పుకారు అలా ఇలా పడి సామాన్యులనూ చేరుకుంది.

ఫలితంగా వాళ్లలో రెండువేల రూపాయల నోటు మీద ఒక అపనమ్మకం ప్రబలుతోంది. గ్రామస్థాయి, మండల స్థాయిల్లోకి వెళితే ప్రజలు రెండువేల రూపాయల నోటు తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. కొంచెం భారీ మొత్తం డబ్బు రెండు వేల రూపాయల నోట్లు అంటే.. వేరే నోట్లు ఇవ్వండి అని అడిగే పరిస్థితి వచ్చింది. మామూలుగా అయితే ఇలాంటి పుకర్లను ప్రజలు విశ్వసించే వాళ్లు కాదు.

అయితే మోడీ పుణ్యమా అని మారకంలోని కరెన్సీ అప్పటికప్పుడు రద్దు కావొచ్చని ప్రజలకు అర్థం అయ్యింది. దీంతో ఇప్పుడు రెండువేల రూపాయల నోటు వారిని భయపెడుతోంది. ఎలాగూ పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నాయి కదా.. ఈ పుకార్లకు తెరదించే ప్రకటన ప్రభుత్వం ఏదైనా చేస్తే మంచిదేమో!
-ఎల్‌.విజయలక్ష్మి

జగన్, పవన్ కలిసి పనిచేసినా మాకు ఓకే 

త్వరలో ఎన్నికలు.. కాంగ్రెస్ తో పొత్తూ వికటించింది.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

కేసీఆర్, బాబు పాలనపై సీనియర్ జర్నలిస్ట్ ఏమన్నారంటే?

వెల్లువెత్తిన అభిమానం మినిష్టర్ క్వార్ట్రర్స్ జామ్ ఎక్కడంటే