cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

ఏపీ, తెలంగాణలో అర్థరాత్రి భూకంపం

ఏపీ, తెలంగాణలో అర్థరాత్రి భూకంపం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఇది 4.7గా నమోదైంది. అర్థరాత్రి 2 గంటల 30 నిమిషాల టైమ్ లో వచ్చిన ఈ ప్రకంపనలు స్వల్పమైనవే. కానీ ప్రజలు మాత్రం ఒకింత భయాందోళనలకు గురయ్యారు. దాదాపు 8 సెకెన్ల పాటు భూమి కంపించింది.

ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో.. తెలంగాణలో నల్గొండ జిల్లాల్లో స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. జగ్గయ్యపేట, చిల్లకల్లు, బెల్లంకొండ, పిడుగురాళ్ల, మాచవరం తదితర ప్రాంతాల్లో భూమి కంపించింది. అర్థరాత్రి వేళ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. 

అటు తెలంగాణలోని నల్గొండ జిల్లాలోనూ పలు గ్రామాల్లో భూమి కంపించింది. సూర్యాపేటలో అర్థరాత్రి 2 గంటల 37 నిమిషాలకు భూకంపం వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. ఇక హైదరాబాద్ సిటీలో కూడా కొన్ని ఏరియాల్లో భూకంపం వచ్చినట్టు ట్విట్టర్ లో పోస్టులు పడుతున్నాయి. 

తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన భూకంపం అత్యంత స్వల్పమైనది, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. టర్కీలో శనివారం సంభవించిన భారీ భూకంపానికి (రిక్టర్ స్కేలుపై 6.8), తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన ప్రకంపనలకు సంబంధం ఉండొచ్చని భావిస్తున్నారు.

ప్రజలకు మేలు చేయని మండలి అవసరమా?