cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

కేసీఆర్ ఎలా ఖతం చేస్తాడో నాకు తెలుసు - ఈటల

కేసీఆర్ ఎలా ఖతం చేస్తాడో నాకు తెలుసు - ఈటల

కబ్జా ఆరోపణలు ఎదుర్కొన్న గంటల వ్యవథిలోనే బర్తరఫ్ కు గురైన ఈటల రాజేందర్.. మరోసారి సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఈసారి తన మాటలకు మరింత పదునుపెట్టారు. 

కేసీఆర్ శిష్యరికంలో 20 ఏళ్లు పెరిగిన తను అస్సలు తగ్గేదిలేదన్నారు. కేసీఆర్ తలుచుకుంటే ఓ వ్యక్తిని ఎలా ఖతం చేస్తాడో తనకు తెలుసంటున్న ఈటల.. ఈసారి కేసీఆర్ పై నేరుగా కొన్ని ప్రశ్నలు సంధించారు. ఈటల మాటల్లోనే అవేంటో చూద్దాం.

- మీతో 19 ఏళ్లు కలిసి రాజకీయ ప్రయాణం చేశాను. ఎప్పుడైనా పైసా వ్యాపారం చేశానా చెప్పండి?

- నిబంధనల ప్రకారం నోటీసులిచ్చి అస్సైన్డ్ భూమిని కొలవాలి. ఇప్పటివరకు గ్రామంలో ఎవరికైనా అలా నోటీసులిచ్చారా?

- భూముల సర్వేకు ఎమ్మార్వో రావాలి కదా.. కలెక్టర్ ను ఎందుకు పంపించారు?

- ఇంత జరుగుతుంటే ముఖ్యమంత్రిగారు నన్ను పిలిపించి ఎందుకు వివరణ అడగలేదు? మంత్రి స్థాయిలో ఉన్న నన్ను వివరణ కోరాల్సిన అవసరం లేదా?

- జమున నా భార్య, నితిన్ నా కొడుకు.. రిపోర్టులో జమున వైఫ్ ఆఫ్ నితిన్ అని రాశారు. వావి వరసలు కూడా లేకుండా అధికారులు రిపోర్టు రాస్తే ఆలోచన చేయరా? మీకు వావివరసలు తెలియవా?

- నా ఇంటి చుట్టూ వందల మంది పోలీసుల్ని పెట్టే అవసం ఏమొచ్చిందో చెప్పండి?

- నయీం ముఠా నన్ను చంపుతానని బెదిరిస్తేనే నేను లొంగలేదు.. మీ బెదిరింపులు నేను పట్టించుకుంటానా?

- నేను మీలానే ధర్మాన్ని నమ్ముకున్నాను.. కాబట్టి కోర్టుకు వెళ్తాను. కోర్టుకు వెళ్లకుండా నన్ను ఎవరైనా ఆపగలరా?

- అస్సైన్డ్ భూమి నుంచి నేను రోడ్డు వేసినట్టు నిరూపించగలరా?

- 19 ఏళ్లుగా ఉద్యమంలో తప్ప, వ్యాపారంలో ఉన్నట్టు నిరూపించగలరా?

- అస్సైన్డ్ భూములున్న ఊరి సర్పంచ్ నాకు మద్దతుగా మాట్లాడాడు. తర్వాత మాట మార్చి నాకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడాడు?

- వైఎస్ఆర్ బలం ముందే నిలబడ్డాను.. ఇప్పుడు నాపై కేసులు పెడితే ఏమౌతుంది?

- మీతో 20 ఏళ్లు పనిచేశాను.. ఒకర్ని టార్గెట్ చేస్తే ఎలా ఖతం చేస్తారో నాకు తెలుసు? మీతో ఎడ్జెస్ట్ కాలేకపోతున్నానని నాపై మీరు సిస్టమ్ ను ఎలా ప్రయోగిస్తున్నారో అందరూ చూస్తున్నారు. ఆ విషయం మీకు తెల్వదా?

- నాపై మీరు ఎన్ని కేసులు పెట్టగలరు.. నన్ను మీరు ఎన్ని రోజులు జైళ్లో పెట్టగలరు?

- నా మొత్తం సంపాదన, ఆస్తుల మీద సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించగలరా?

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×