cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

మ‌రోసారి వైఎస్సార్‌ను గుర్తు చేసుకున్న ఈట‌ల

మ‌రోసారి వైఎస్సార్‌ను గుర్తు చేసుకున్న ఈట‌ల

మాజీ మంత్రి, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ టార్గెట్‌కు గురైన ఈట‌ల రాజేంద‌ర్ మ‌రోసారి దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిని గుర్తు చేసుకున్నారు. మంత్రులు కొప్పుల ఈశ్వ‌ర్‌, గంగుల కరుణాక‌ర్ త‌న‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేసిన నేప‌థ్యంలో ఈట‌ల మీడియా ముందుకొచ్చారు. త‌న‌పై మంత్రుల వ్యాఖ్య‌ల‌ను వారి విచ‌క్ష‌ణ‌కే విడిచి పెడుతున్న‌ట్టే చెప్పారు. కానీ తెలంగాణ ఉద్య‌మంలో త‌న పాత్ర లేద‌న‌డంపై ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

గ‌తంలో అధికారంలోకి వ‌చ్చిన కొత్త‌లో ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ఉన్న కేసీఆర్‌ను క‌లిసేందుకు మంత్రి హోదాలో వెళ్లిన త‌న‌తో పాటు మ‌రో ప‌ది మంది ఎమ్మెల్యేల‌కు అనుమ‌తి నిరాక‌రించిన విష‌యాన్ని గుర్తు చేశారు. నాడు ఎమ్మెల్యేగా గంగుల క‌రుణాక‌ర్ అన్న మాట‌ల‌ను ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుర్తు చేశారు. కేసీఆర్ నియంతృత్వ పోక‌డ‌ల‌పై గంగుల తీవ్ర వ్యాఖ్య‌లు చేశార‌న్నారు. అలాంటివి చాలా ఉన్నాయ‌ని, అయితే వాటి గురించి చెప్ప‌డం త‌న‌కు ఇష్టం లేద‌న్నారు.

ప్ర‌జాస్వామ్యంలో అధికార‌, ప్ర‌తిప‌క్ష స‌భ్యులు ఉంటార‌న్నారు. వారంతా క‌లిసి మాట్లాడుకోవ‌డం స‌హ‌జ‌మ‌న్నారు. కానీ ప్ర‌స్తుతం తెలంగాణ‌లో అలాంటి వాతావ‌ర‌ణం అస‌లు లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా నాడు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ముఖ్య‌మంత్రిగా వైఎస్సార్ ఉన్న‌ప్ప‌టి ఓ అనుభ‌వాన్ని ఆయ‌న వెల్ల‌డించారు. అప్ప‌ట్లో ప‌ది మంది ఎమ్మెల్యేలు మాత్ర‌మే ఉన్నార‌న్నారు. వారిలో న‌లుగురు ఎమ్మెల్యేలు సుప్ర‌భాత వేళ‌లో ద‌ర్శ‌నం చేసుకున్నార‌నే టాక్ న‌డిచింద‌న్నారు.

తాను ఓ రోజు ముఖ్య‌మంత్రి వైఎస్సార్‌ను క‌లిసేందుకు వెళుతుంటే మీడియా ప్ర‌తినిధులు అనుమానంగా చూశార‌న్నారు. వైఎస్సార్‌ను క‌లిస్తే మిమ్మ‌ల్ని కూడా ఫిక్స్ చేస్తార‌ని మీడియా ప్ర‌తినిధులు హెచ్చ‌రించార‌ని గుర్తు చేశారు. తాను ఈట‌ల రాజేంద‌ర్‌ను అని, అలా క‌లిసిపోతే ప్ర‌జాస్వామ్యం ఖూనీ అవుతుంద‌ని చెప్పాన‌న్నారు. అయితే తాను వెళ్లి వైఎస్సార్‌ను క‌లిశాన‌న్నారు.

తాను వెళ్లింది ప్ర‌జాస‌మ‌స్య‌పై అని చెప్పారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని జ‌మ్మ‌కుంట‌కు నీళ్లు ఇవ్వాల‌ని సీఎంను కోరాన‌న్నారు. కానీ తెలంగాణ‌లో త‌మ ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడేళ్లైంద‌ని, ఈ కాలంలో ఏ ఒక్క ప్ర‌తిప‌క్ష స‌భ్యుడు మంత్రుల‌ను క‌లిసిన సంద‌ర్భ‌మే లేదన్నారు. మంత్రుల‌ను ప్ర‌తిప‌క్ష స‌భ్యులు క‌లిసి ప‌నులు చేయాల‌ని కోర‌డం ఓ క‌ల్చ‌ర్ అని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఏడేళ్ల‌వుతున్నా మంత్రుల‌ను ప్ర‌తిప‌క్ష స‌భ్యులు క‌ల‌వ‌క‌పోవ‌డం దేశంలో ఎక్క‌డా లేద‌ని ఈట‌ల ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

నిన్న మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్‌ను క‌లిసిన విష‌యాన్ని గుర్తు చేసుకున్నారు. గ‌తంలో దేవరాయాంజల్ భూముల స‌మ‌స్య‌ను అప్పటి సీఎం వైఎస్ దృష్టికి తీసుకెళ్లాన‌న్నారు. ఆయ‌న స్పందించి ఓ క‌మిటీని వేసి నివేదిక తెప్పించుకున్నార‌ని తెలిపారు. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తు ఆయ‌న ప‌ర‌మ‌ప‌దించార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆయ‌న బ‌తికే ఉంటే స‌మ‌స్య ప‌రిష్కార‌మ య్యేద‌ని ఈట‌ల తెలిపారు. ఆ త‌ర్వాత వ‌చ్చిన ముఖ్య‌మంత్రులెవ‌రూ ఆ దేవాల‌య భూముల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిం చ‌లేద‌న్నారు. 

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×