cloudfront

Advertisement


Home > Politics - Political News

ఎలక్షన్స్‌ -2019 'గ్రేట్‌ఆంధ్ర' సర్వే

ఎలక్షన్స్‌ -2019 'గ్రేట్‌ఆంధ్ర' సర్వే

ఈ నెలాఖరులో ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చినెల ప్రథమార్థంలోనే ఎన్నికల నోటిఫికేషన్‌ కూడా విడుదల కావొచ్చు. ప్రత్యేకించి ఏపీకి అటు లోక్‌సభ  ఇటు అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజల పల్స్‌ను పట్టే ప్రయత్నం చేస్తోంది 'గ్రేట్‌ఆంధ్ర'.

ప్రస్తుత రాజకీయ పరిస్థితి గురించి అధ్యయనం చేస్తూ ఉంది. నియోజకవర్గాల వారీగా సర్వేను నిర్వహిస్తూ ఉంది. సర్వే అనగానే.. వాళ్లకు ఇన్ని సీట్లు, వీళ్లకు ఇన్ని సీట్లు అని నంబర్లు చెప్పేయకుండా.. క్షేత్రస్థాయిలో తిరిగి, కొన్ని లక్షల శాంపిల్స్‌ను తీసుకుని ఈ అధ్యయనాన్ని చేపట్టింది 'గ్రేట్‌ఆంధ్ర'.

నియోజకవర్గాల వారీగా సర్వే సాగుతూ ఉంది. నియోజకవర్గాల వారీగా ఫలితాలను 'గ్రేట్‌ఆంధ్ర' ప్రచురితం చేస్తుంది. అందులో భాగంగా ఈ వారంలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రేట్‌ఆంధ్ర చేపట్టిన సర్వే ఫలితాలు ఇవి. ఈ సర్వే ఫలితం.. ప్రస్తుత రాజకీయ పరిస్థితికి సంబంధించినది. ఎన్నికల నాటికి ఇందులో కొంతమార్పు ఉండొచ్చు. ఆ మార్పు ఎటు అయినా ఉండొచ్చు.

వినుకొండలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు లీడ్‌!

నియోజకవర్గం పేరుః వినుకొండ (గుంటూరు జిల్లా)
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మంచి మెజారిటీతో నెగ్గిన నియోజకవర్గం వినుకొండ. జీవీ ఆంజనేయులు ఇక్కడ తెలుగుదేశం తరఫు నుంచి నెగ్గారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపు నుంచి నన్నపనేని సుధ పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఇక ప్రస్తుతానికి వస్తే తెలుగుదేశం పార్టీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే రంగంలోకి దిగే అవకాశాలున్నాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫు నుంచి బొల్లా బ్రహ్మంనాయుడు ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. వీరి మధ్య.. వీరి పార్టీల మధ్య.. ప్రజల ఎంపిక ఏది? అనే అంశం గురించి వినుకొండలో 'గ్రేట్‌ఆంధ్ర'  నిర్వహించిన అధ్యయనం ఫలితాలు ఇలా ఉన్నాయి.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ - 53 శాతం
తెలుగుదేశం పార్టీ - 45 శాతం
జనసేన - 2 శాతం

ఇదే పరిస్థితి ఎన్నికల వరకూ కొనసాగితే.. వినుకొండలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండా పాతనుంది.

లీడ్‌లో ఉన్న ఎమ్మెల్యే రోజా!

నియోజకవర్గం పేరు: నగరి (చిత్తూరు జిల్లా)
చిత్తూరుజిల్లా నగరిలో గత ఎన్నికల్లో ఆర్కే రోజా విజయం సాధించారు. తెలుగుదేశం సీనియర్‌ పొలిటీషియన్‌ గాలి ముద్దుకష్ణమ నాయుడు మీద ఆమె విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలోకి ప్రవేశించారు. అధికారపక్షానికి ప్రత్యేక లక్ష్యంగా నిలిచారు రోజా. అసెంబ్లీ నుంచి ఏడాది పాటు బహిష్కరించడం, ఆమె వాదన వినడానికి కూడా ఏపీ అసెంబ్లీ ఆసక్తి చూపకపోవడం.. ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు గురయ్యారు ఆమె. రోజా స్థానికంగా ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ వచ్చారు.

ఇక తెలుగుదేశం పార్టీ తరఫున గత ఎన్నికల్లో పోటీచేసిన ముద్దుకృష్ణమ కొన్నాళ్ల కిందట మరణించారు. ఆయన తనయులు ఇద్దరూ రాజకీయ వారసత్వం కోసం పోటీ పడ్డారు. చేసేది లేక చివరకు ముద్దుకృష్ణమ భార్యకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఇక ఎమ్మెల్యేగా అభ్యర్థిత్వం ఎవరికి అనే అంశం గురించి ఖరారు చేయలేదు. ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ పార్టీల వారీగా బలాబలాలు 'గ్రేట్‌ఆంధ్ర' సర్వేలో ఇలా తేలాయి.

వైఎస్సార్‌  కాంగ్రెస్‌ పార్టీ - 53 శాతం
తెలుగుదేశం పార్టీ- 46 శాతం
ఇతరులు - ఒకశాతం

ఇది తాజా పరిస్థితి. ఎన్నికల నాటికి ఇదే పరిస్థితి కొనసాగితే.. రోజా మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక కానున్నారు.

రాజకీయంలో డబ్బే డబ్బు.. ఇదే రాజకీయ సిద్ధాంతం..!

వైఎస్సార్ డైలాగ్స్ పబ్లిక్ చెప్తే.. ఆ కిక్కే వేరప్పా