cloudfront

Advertisement


Home > Politics - Political News

బాబు ఓవరాక్షన్.. బుక్ అవుతున్న ఉద్యోగులు

బాబు ఓవరాక్షన్.. బుక్ అవుతున్న ఉద్యోగులు

ప్రభుత్వ ఉద్యోగుల శాపం కారణంగానే గతంలో అధికారానికి దూరమయ్యారు చంద్రబాబు. ఈసారి కూడా ఉద్యోగులు బాబు పాలనపై విసిగి వేసారిపోయారు. మధ్యంతర భృతి విషయంలో నాన్చుడు ధోరణి, సీపీఎస్ రద్దుకి మద్దతు తెలపకపోవడంతో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు బాబుకి వ్యతిరేకంగానే ఓటు వేశారని సర్వేలు చెబుతున్నాయి. అలాంటి ఉద్యోగులను ఎన్నికల తర్వాత కూడా ఇబ్బంది పెడుతున్నారు చంద్రబాబు.

రాష్ట్రవ్యాప్తంగా ఈవీఎంల నిర్వహణలో నిర్లక్ష్యం చూపినందుకు ఇప్పటికే పలువురు రిటర్నింగ్ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఓ తహశీల్దార్ సస్పెండ్ అయ్యారు కూడా. డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులకు కూడా తిప్పలు తప్పడంలేదు. దీనంతటికీ కారణం చంద్రబాబే. చంద్రబాబు ఈవీఎంల పనితీరుపై చేస్తున్న అనవసర రాద్ధాంతం కారణంగానే.. ఉద్యోగులు చిన్న తప్పులకి కూడా పెద్దశిక్షలు అనుభవిస్తున్నారు.

సరైన సమయం లేక, శిక్షణ సరిగా అందక.. పోలింగ్ రోజు ఉద్యోగులు కొన్ని తప్పులు చేశారు. అయితే ఆ తప్పులేవీ అభ్యర్థుల తలరాతలు మార్చేంత పెద్దవికావు. కానీ చంద్రబాబు చేస్తున్న రాద్ధాంతం కారణంగా ఉద్యోగులు జనాల నోళ్లలో నానుతున్నారు. ఈవీఎంలు సకాలంలో స్ట్రాంగ్ రూములకు చేర్చకపోవడం, మాక్ పోలింగ్ కి సంబంధించిన వీవీప్యాట్ స్లిప్పులు బైటకు రావడం.. ఇలాంటి కారణాలతో ఉద్యోగులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

బాబు ఓవర్ యాక్షన్ వల్ల.. ఈసీ కాస్త అతిగా స్పందించి రిటర్నింగ్ అధికారులు, ఇతర సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. ఓడిపోయే చంద్రబాబుకి ఇదంతా ఎందుకంటూ చాలామంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు దుమ్మెత్తి పోస్తున్నారు. తప్పుచేస్తే శిక్ష అనుభవిస్తామని, ఇలా.. చేయని తప్పులకు తమని క్రిమినల్ కేసుల్లో ఇరికించడం తగదని వాపోతున్నారు. మొత్తమ్మీద పదవి నుంచి దిగిపోయేటప్పుడు కూడా చంద్రబాబు ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్నారని పలువురు మాట్లాడుకుంటున్నారు. 

మాస్ పెట్టుకుని స్టైల్ గా చేస్తే మస్తు ఎంజాయ్