Advertisement

Advertisement


Home > Politics - Political News

ఈనాడుని భయపెడుతున్న వాట్సప్ గ్రూప్

ఈనాడుని భయపెడుతున్న వాట్సప్ గ్రూప్

ప్రింట్ ఎడిషన్ కష్టాలు అంతకంతకూ పెరుగుతున్న వేళ.. డిజిటల్ ఎడిషన్ పై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టింది ఈనాడు యాజమాన్యం. నెట్ ఎడిషన్లో అందించే వార్తలతో పాటు.. పీడీఎఫ్ గా విడుదల చేసే ఈ-పేపర్ కి ఎక్కువ ఆదరణ ఉంటుందని ఆశించింది. అయితే ఈనాడు నెట్ ఎడిషన్లో లభించే ఈ-పేపర్ కి ఎక్కువగా డౌన్ లోడ్ లింక్ లు రావడం లేదు. ఏంటా అని ఆరా తీస్తే.. అసలు కారణం వాట్సప్ అని తెలిసింది.

ఈ రోజుల్లో ప్రతి వాట్సప్ గ్రూప్ లో నాలుగైదు రకాల న్యూస్ పేపర్ల లింక్ లు పీడీఎఫ్ రూపంలో లభిస్తుంటాయి. ఒకరు డౌన్ లోడ్ చేసి వందల మందికి మెసేజ్ ల రూపంలో ఈ పీడీఎఫ్ ఫార్మాట్ ని పంపిస్తుంటారు. ఈనాడు సైట్ లో నుంచి డౌన్ లోడ్ చేసుకుంటేనో, లేదా ఆ సైట్ కి వచ్చే క్లిక్స్ రూపంలో కాస్తో కూస్తో యాజమాన్యానికి ఆదాయం లభిస్తుంది. అయితే ఇలా వాట్సప్ లో జరిగే ఉచిత బడ్వాటా వల్ల యాజమాన్యం గుల్లయిపోతోంది.

చాలా రోజులుగా ఈ వ్యవహారం జరుగుతున్నా.. కరోనా కష్టకాలంలో ఇలాంటి వాటిని కట్టడి చేయాలని భావించింది రామోజీ కంపెనీ. వాట్సప్ గ్రూపుల్లో ఈనాడు ఈ-పేపర్ ను పోస్ట్ చేస్తున్నవారిపై అలిపిరిలో పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ చేసింది ఈనాడు గ్రూప్. కాపీరైట్ చట్టం కింద పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. అయితే ఈ ఎపిసోడ్ లో నిందితులు వాట్సప్ గ్రూపుల్లో ఉన్న వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనడం ఆశ్చర్యం కలిగించక మానదు.

నెలకు 50 రూపాయలు సబ్ స్క్రిప్షన్ ఫీజు కింద తమకు కట్టినవారిని మాత్రమే వాట్సప్ గ్రూపుల్లో చేర్చి, ఆ గ్రూపుల్లో ఈనాడు ఈ-పేపర్ ను పోస్ట్ చేస్తున్నారట. వద్దనుకుంటున్నా వాట్సప్ గ్రూపుల్లో యాడ్ చేసి, పనికిమాలిన చెత్తనంతా పోస్ట్ చేస్తున్న ఈ రోజుల్లో, ఇలా 50 రూపాయలు చదివించుకునే అమాయకులుంటారా అనేదే డౌటు.

ఏదైతేనేం మొత్తానికి ఈనాడు కాపీరైట్ చట్టాన్ని బయటకు తీసింది. పాఠకులెవరైనా ఉచితంగా తమ సైట్ లో పేపర్ చదువుకోవచ్చని, డౌన్ లోడ్ చేసుకుని తాము మాత్రమే చూడొచ్చని చెబుతున్న యాజమాన్యం, డౌన్ లోడ్ చేసుకున్న పేపర్ ని సోషల్ మీడియాలో ఉంచడం మాత్రం కాపీరైట్ ఉల్లంఘనేనంటోంది. అలా అయితే ఇప్పటివరకూ అన్ని పత్రికలకూ ఇలాంటి నష్టం చాలానే జరిగింది. మరి మిగతా యాజమాన్యాలు కూడా ఇలా సోషల్ మీడియాలో ఈ-పేపర్ పోస్టింగ్ లని వ్యతిరేకిస్తాయో లేక, ఫ్రీ పబ్లిసిటీని కొనసాగిస్తాయో చూడాలి.

'విశ్వక్' మూవీకి నాకు సంబంధం..?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?