cloudfront

Advertisement


Home > Politics - Political News

ఏంటిది రామోజీ.. మరీ ఇంత దిగజారాలా..?

ఏంటిది రామోజీ.. మరీ ఇంత దిగజారాలా..?

తెలంగాణలో ప్రచారపర్వం ముగిసింది. మీడియా సంస్థలన్నీ ఎన్నికల కోడ్ దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా వార్తల్ని వండి వారుస్తున్నాయి. ఈటీవీ ప్రైమ్ టైమ్ బులిటెన్ లో కూడా ఇది క్లియర్ గా కనిపించింది. కేవలం ఓటింగ్ యంత్రాలు, పోలింగ్ బూత్ లు, ఓటర్లు, ఎన్నికల ఏర్పాట్లు.. ఇవే ప్రధానాంశాలు. అయితే అంతలోనే చంద్రబాబు బొమ్మ తెరపైకి వచ్చింది. చంద్రన్న కానుకలు టీవీ నిండుగా కనిపించాయి.

క్రిస్మస్, సంక్రాంతి సందర్భంగా ఏపీలో పంపిణీ చేస్తున్న చంద్రన్న కానుకలకు సంబంధించి మంత్రి పెట్టిన ఓ ప్రెస్ మీట్ ని హైలెట్ చేసి చూపించింది ఈటీవీ. పదే పదే చంద్రబాబు ఫొటో ఉన్న సంచుల్ని ప్రసారం చేసింది. వాస్తవంగా ఆలోచిస్తే.. ఇది ప్రైమ్ టైమ్ బులిటెన్ కి పెట్టే వార్త కాదు.

కానీ ఎన్నికల కోడ్ ని తప్పించుకుని చంద్రబాబుని చూపించాలి, బాబు పథకాలకు డప్పు కొట్టాలంటే ఆమాత్రం దిగజారక తప్పదు. అందుకే కాస్త పరిధి దాటారు, కోడ్ ని చాలా తెలివిగా ఉల్లంఘించారు. తెలంగాణ ఎన్నికల కోసం ఏపీ ప్రజల సొమ్ముని టీడీపీ ప్రభుత్వం ప్రకటనల రూపంలో దుబారా చేసిందని అందరికీ తెలుసు.

సందర్భం లేకపోయినా పథకాలపై విచ్చలవిడిగా ప్రకటనలు ఇచ్చేశారు. ప్రకటనలే కాదు, అనుకూల మీడియా వండివార్చే కథనాల్లో కూడా ఏపీలో ఏదో పెద్ద అభివృద్ధి జరిగిపోతోందని, తెలంగాణలో కూడా టీడీపీ నిర్ణయాత్మక శక్తిగా మారితే అలాంటి అభివృద్ధే జరుగుతుందని చూపించారు.

ప్రచార సమయంలో అంతా బాగానే జరిగిపోయింది, మరి కోడ్ అమల్లోకి వచ్చిన కొన్ని గంటలు కూడా ఈటీవీ మౌనంగా ఉండలేకపోయింది. స్వామి భక్తిని చూపించుకునేందుకు తాపత్రయ పడింది. ఏపీలో ఎన్నికలు లేవు కాబట్టి, ఇక్కడ వార్తలకు పరిమితులు ఉండవనే లాజిక్ తో మంత్రిగారి ప్రెస్ మీట్ ని టెలికాస్ట్ చేసింది.

పనిలో పనిగా బాబుగారి చిరు దరహాసం బాగా కనపడేట్టు జాగ్రత్తలు తీసుకుంది. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి ప్రచారానికి సంబంధించిన సన్నివేశాలు చూపించినందుకు ఇప్పటికే ఓ మీడియా సంస్థకు నోటీసులు జారీచేసింది ఎన్నికల సంఘం.

మాధ్యమాల్లో ప్రసారమయ్యే వార్తలపై ఎలక్షన్ కమిషన్ ఎంత సునిశితంగా ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అయినప్పటికీ కోడ్ కు కూడా దొరక్కుండా ఇలా చంద్రబాబును చూపించి తమ స్వామిభక్తిని, తెలివితేటల్ని ప్రదర్శించింది ఈటీవీ.

సుజనా ఏమార్చేది ఇలాగేనా చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్