cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

ఇండియా రానున్న అమెరికా అందాల రాశి

ఇండియా రానున్న అమెరికా అందాల రాశి

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఆ దేశ అందాల రాశి ఇవాంకా కూడా త‌న తండ్రితో పాటు ఇండియాకు రానున్నారు. ఈ నెల 24, 25 తేదీల్లో ట్రంప్ భార‌త్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ట్రంప్‌తో పాటు ఆయ‌న భార్య మెలానియా ఇండియాకు వ‌స్తున్న విష‌యం తెలిసిందే.

తాజాగా అందుతున్న స‌మాచారం మేర‌కు ట్రంప్ కుమార్తె, వైట్‌హౌస్ స‌ల‌హాదారు అయిన ఇవాంక ట్రంప్, ఆమె భ‌ర్త జేర్డ్ కుష్న‌ర్ కూడా ఇండియా టూర్‌కు వ‌స్తున్నారు. ఈ విష‌యాన్ని భార‌త విదేశీ అధికారులు ద్రువీక‌రించారు.  ఢిల్లీతో పాటు అహ్మ‌దాబాద్‌లో డొనాల్డ్ ట్రంప్ ప‌ర్య‌టించ‌నున్నారు.  ట్రంప్ భార్య మెలానియా.. ఢిల్లీలోని ఓ పాఠ‌శాల‌కు వెళ్ల‌నున్నారు.    అహ్మ‌దాబాద్‌లో మొతేరా స్టేడియాన్ని ట్రంప్‌, మోదీలు ప్రారంభించ‌నున్నారు.  ఆగ్రాలోని తాజ్‌ను కూడా ట్రంప్ ఫ్యామిలీ సంద‌ర్శించ‌నున్న‌ది.

2017లో ఇవాంక ట్రంప్‌ హైద‌రాబాద్‌లోనూ ప‌ర్య‌టించిన విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లో అమెరికాతో సంబంధాలు ఏర్పాటు చేసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె, వైట్‌హౌస్‌ సలహాదారు అయిన ఇవాంక ట్రంప్‌ను భారత్‌కు ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వా నించారు. ప్ర‌ధాని ఆహ్వానం మేర‌కు ఇవాంక హైద రాబాద్‌లో జరిగిన‌ 8 గ్లోబల్‌ ఎంట్రప్రెన్యూర్స్‌ సమ్మిట్‌కు అమెరికా పారిశ్రామికవేత్తల బృందాన్ని కూడా వెంట పెట్టుకొచ్చారు.

అప్ప‌ట్లో ఆమె ప‌ర్య‌ట‌నపై మీడియా విప‌రీత‌మైన ప్ర‌చారం చేసింది. గ్లోబ‌ల్ ఎంట‌ర్‌ప్రీన‌ర్‌షిప్ స‌మ్మిట్‌లో పాల్గొన్న ఇవాంక‌తో తెలంగాణ మంత్రి కేటీఆర్  చ‌ర్చాగోష్టి నిర్వ‌హించడం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. మూడేళ్ల‌కు మ‌ళ్లీ ఆమె ఇండియాకు వ‌స్తుండ‌టం విశేషం.

రష్మిక లెగ్గుతో నితిన్ కి