Advertisement

Advertisement


Home > Politics - Political News

ఉత్కంఠ రేపాడు ... సంచలనం ఏమిటో చెబుతాడా ?

ఉత్కంఠ రేపాడు ... సంచలనం ఏమిటో చెబుతాడా ?

తెలంగాణలో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ను, సీఎం కేసీఆర్ ను ఏదో విధంగా భ్రష్టు పాటించాలని బీజేపీ శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే కేసీఆర్ మీద ప్రజల్లో అంతో ఇంతో వ్యతిరేకత ఉంది. దుబ్బాక ఉప ఎన్నికలో, జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఈ విషయం నిరూపణ అయింది. 

ఈ వ్యతిరేకతను మరింత పెంచాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ ప్రతిరోజూ అనేక ఆరోపణలు చేస్తున్నారు. అందులో ఏవి నిజమో, ఏవి కావో తెలియదు. ప్రస్తుతం ప్రతిపక్షాలకు, ప్రభుత్వానికి మధ్య ఉద్యోగాల విషయంలో మాటల యుద్ధం జరుగుతోంది. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరగబోతున్న నేపథ్యంలో సంజయ్ ప్రజల్లో ఉత్కంఠ రేకెత్తించాడు.

కేసీఆర్ గురించిన ఓ సంచలన విషయం ఉందన్నాడు. కానీ అదేమిటో చెప్పకపోవడంతో  అదేమిటో తెలుసుకోవాలనే ఆసక్తి జనంలో సహజంగానే కలుగుతుంది.  కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడు ఓ పెద్ద తప్పు చేశారని ఆరోపించాడు.  కేసీఆర్ పార్లమెంటును ఎలా తప్పుదారి పట్టించాడో త్వరలోనే ప్రజలకు తెలియచేస్తానని అన్నాడు.  

ఇందుకోసం లోక్‌సభ స్పీకర్ పర్మిషన్ తీసుకోబోతున్నట్లు చెప్పాడు.  ఒకవేళ స్పీకర్ పర్మిషన్ ఇస్తే.. తెలంగాణ ప్రజలకు పార్లమెంట్ సాక్షిగా వాస్తవాలు చెబుతానని అన్నాడు. అదే జరిగితే కేసీఆర్ బండారం బయటపడుతుందని.. ఆ అంశం పార్లమెంటును కచ్చితంగా కుదిపేస్తుందని అన్నాడు. 

అయితే ఆ విషయం ఏమిటన్నది ఇప్పుడు అడగొద్దని చెప్పాడు. కేసీఆర్ ఇప్పుడు పార్లమెంటు సభ్యుడు కాదు. యూపీఏ ప్రభుత్వంలో ఎంపీగా ఉండటమే కాకుండా కార్మిక మంత్రిగా పనిచేశారు. అప్పుడేవో అవకతవకలు చేశారని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. కానీ అవేమిటో బయటకు రాలేదు. కానీ సంజయ్ దాన్ని గురించి ప్రస్తావించకుండా పార్లమెంటును తప్పుదోవ పట్టించారని అంటున్నారు. ఆ విషయం బయటపెట్టాలంటే స్పీకర్ పర్మిషన్ ఇవ్వాలట.

ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడు కానీ వ్యక్తి గురించి చెప్పడానికి స్పీకర్ పర్మిషన్ ఎందుకో సామాన్య జనానికి అర్ధం కాదు. కానీ తాను  చెప్పబోయేది సంచలన విషయమని, పార్లమెంటును కుదిపేస్తుందని అంటున్నాడు. అసలు  సంజయ్ దగ్గర సంచలన విషయం ఉందోలేదో తెలియదు. కాంగ్రెస్ నాయకులుగాని, బీజేపీ నాయకులుగాని కేసీఆర్, కేటీఆర్, కవిత పెద్ద అవినీతిపరులని ఆరోపణలు చేస్తుంటారు. కానీ వారి అవినీతి ఏమిటో ఇప్పటివరకు చెప్పలేదు. 

కొంతైనా బయట పెట్టొచ్చు కదా. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మీద ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్, టీడీపీ కేసులు వేశాయి. ఫలితంగా జగన్ కొన్నాళ్ళు జైల్లో ఉండాల్సి వచ్చింది. రాష్ట్ర విభజన జరిగి కూడా ఆరేళ్ళు అయింది. జగన్ సీఎం కూడా అయ్యాడు. కానీ ఇప్పటివరకు ఏమీ కాలేదు. ఆనాడు జగన్ మీద కేసులు వేసిన కాంగ్రెస్ కు, టీడీపీకి ఇప్పుడు కేసీఆర్ మీద కేసులు పెట్టే  దమ్ము లేదా ? ఇప్పుడు బీజేపీ కూడా అదే దార్లో నడుస్తోంది. 

లోకేష్‌కు  పిచ్చి పీక్స్‌కు చేరిపోయింది

నారావారి కుటుంబంలో మాన‌సిన స‌మ‌స్య ఉంది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?