cloudfront

Advertisement


Home > Politics - Political News

ఏపీలో ఫ్యాన్ సునామీ..!

ఏపీలో ఫ్యాన్ సునామీ..!

-రెండో రౌండ్ కౌంటింగ్ ముగుస్తున్న సమయానికి ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 'ఫ్యాన్' స్పీడ్ అందుకుంది. ఏకంగా వందకు పైగా అసెంబ్లీ సీట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉండటం గమనార్హం.

-తెలుగుదేశం పార్టీ కేవలం 23 ఎమ్మెల్యే సీట్లలో మాత్రమే ఆధిక్యత సంపాదించింది.

-ఎంపీ సీట్ల విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14 ఎంపీ సీట్లలో ఆధిక్యత కనబరుస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ మూడు ఎంపీ సీట్లలో ఆధిక్యతను కలిగి ఉంది.

-సంచలన అంశం ఏమిటంటే.. కుప్పంలో చంద్రబాబు నాయుడు వెనుకబడటం. రెండో రౌండ్ కౌంటింగ్ ముగిసే సరికి కుప్పంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చంద్రమౌళి అరవై ఏడు ఓట్ల మెజారిటీని సాధించారు.

-జనసేన అధిపతి పవన్ కల్యాణ్ రెండు అసెంబ్లీ స్థానాల్లోనూ వెనుకబడి ఉండటం గమనార్హం. 

-ఆధిక్యంలో ఉన్న నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు స్పష్టమైన మెజారిటీలు సాధిస్తూ ఉన్నారు. ఈ ధాటి చూస్తూ ఉంటే.. ఏపీలో ఫ్యాన్ సునామీ సృష్టించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి.