Advertisement

Advertisement


Home > Politics - Political News

ఫేక్ ఛాంపియన్.. ఇంగ్లండ్ విజయంపై మరక!

ఫేక్ ఛాంపియన్.. ఇంగ్లండ్ విజయంపై మరక!

దశాబ్దాలుగా తాము ఎదురుచూసిన ప్రపంచకప్ విజయంతో ఇంగ్లండ్ హ్యాపీగానే కనిపిస్తోంది. తాము క్రికెట్ లో జగజ్జేతగా నిలిచినందుకు ఆ జట్టు ఆనందంగానే ఉంది. తమ ప్రపంచకప్ విజేతలకు ఇంగ్లండ్ ప్రధాని ప్రత్యేకంగా డిన్నర్ కూడా ఇచ్చారు. అలా ఇంగ్లిష్ జట్టు ఆనందంగా ఉంటే.. మిగతా క్రికెట్ ప్రపంచం మాత్రం ఈ విజయాన్ని ఆమోదించేలా కనిపించడం లేదు.

ఇంగ్లండ్ ను ఫేక్ చాంఫియన్ అంటూ మండిపడుతూ ఉన్నారు అనేకమంది. ప్రపంచకప్ విజేతగా ఇంగ్లండ్ నిలవడం అనేది కేవలం సాంకేతికమైన అంశం మాత్రమే అని క్రికెట్ ఫ్యాన్స్ ఇక అభిప్రాయానికి వచ్చేశారు. కేవలం ఫోర్లు ఎక్కువ కొట్టారు కాబట్టే ఇంగ్లండ్ ప్రపంచకప్ విజేత అనడం ప్రహసనంగా మారింది. క్రికెట్ లో రన్ అంటే రన్ అంతే. అది ఫోరా, సిక్సా అనేది లెక్క కానే కాదు!

క్రికెట్ లో పోటీ రన్స్ కు మాత్రమే కానీ, ఫోర్లు, సిక్సులకు కాదు. అలా అంటే అది క్రికెట్టే కాదు! క్రికెట్ ను 'జంటిల్మన్ గేమ్' అని అంటారు. మరి ఫోర్లు ఎక్కువ కొట్టారని ఒక జట్టును ప్రపంచకప్ విజేతగా ప్రకటించడం ఎంతవరకూ జంటిల్మన్ షిప్ అవుతుందనే న్యాయమైన ప్రశ్నను వేస్తున్నారు క్రికెట్ అభిమానులు.

ఇలా ఇంగ్లండ్ ఇక ఫేక్ చాంపియన్ అని వారు ట్రోల్ చేస్తున్నారు. ఇలా మొత్తానికి విజేత అని అనిపించుకున్నా.. ఇంగ్లండ్ కు ఐసీసీ నియమాల వల్ల మాత్రమే ట్రోఫీ అందడం విమర్శలకు దారితీస్తోంది. ఆ జట్టునే ఫేక్ ఛాంపియన్ అనేందుకు కారణం అవుతోంది. ఈ విమర్శలు ఇంగ్లండ్ కు కూడా సంతృప్తి లేకుండా చేసే అవకాశం ఉంది.

న్యూజిలాండ్ ను కూడా ప్రపంచకప్ విజేతగా ప్రకటించి, ఇద్దరికీ ట్రోఫీని ప్రదానం చేయాల్సిందని మెజారిటీ క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతూ ఉన్నారు. అయితే తలతిక్క నిర్ణయాల ఐసీసీ మాత్రం ఈ విషయంలో స్పందించడం లేదు.

పరిటాల సునీతకు కోరుకున్నది దక్కింది.. ఉంటారా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?