cloudfront

Advertisement


Home > Politics - Political News

పవన్ కు ఎట్టకేలకు మంచి అమ్మాయి దొరికింది

పవన్ కు ఎట్టకేలకు మంచి అమ్మాయి దొరికింది

రాజకీయ నాయకులంతా పవన్ పెళ్లిళ్లపై కామెంట్స్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు పవన్ అన్నయ్య నాగబాబు. పవన్ 4 పెళ్లిళ్లు చేసుకున్నాడనే కామెంట్స్ ను తిప్పికొట్టిన నాగబాబు, "మా తమ్ముడు జస్ట్ 3 పెళ్లిళ్లు మాత్రమే" చేసుకున్నాడంటూ వెనకేసుకొచ్చాడు.

"మా తమ్ముడు పర్సనల్ లైఫ్ పై నేను కామెంట్ చేయకూడదు. కానీ స్పందిస్తున్నాను. మొదట ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కానీ స్థిరపడలేదు. మర్యాదగా విడాకులు ఇచ్చాడు. ఇరు కుటుంబాల మధ్య కోర్టు ప్రకారం, చట్టప్రకారం విడాకులు తీసుకున్నాడు. అదే టైమ్ లో రేణుదేశాయ్ తో అండర్ స్టాండింగ్ ఏర్పడింది."

రేణుదేశాయ్ తో పవన్ సహజీవనం చేశారని చెప్పుకొచ్చాడు నాగబాబు. కొన్నాళ్లు సహజీవనం చేసిన తర్వాతే వాళ్లు పెళ్లి చేసుకున్నారని, కానీ ఇద్దరిమధ్య ఏదో జరిగిందంటున్నాడు.

"పవన్-రేణుదేశాయ్ కొంతకాలం కలిసున్నారు, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. మళ్లీ ఇద్దరి మధ్య ఏదో జరిగింది. ఈసారి కూడా చట్టప్రకారం మ్యూచువల్ గానే విడిపోయారు. ఇప్పుడొచ్చిన అమ్మాయి రష్యన్. ఇంతకుముందు రెండు కుటుంబాల వాళ్లు పెద్దగా మాతో కలిసేవారు కాదు. కానీ ఇప్పుడున్న రష్యన్ అమ్మాయి మాత్రం చాలా చక్కగా మాతో కలిసిపోయింది. ఇన్నాళ్లకు కల్యాణ్ బాబుకు మంచి అమ్మాయి దొరికింది."

పవన్ 4 పెళ్లిళ్లు చేసుకున్నాడంటే కస్సుమంటున్నారు నాగబాబు. మూడు పెళ్లిళ్లు మాత్రమే చేసుకున్నారని క్లారిటీ ఇస్తున్నారు. ప్రతి భార్యకు చట్టబద్ధంగా విడాకులు ఇచ్చారని అంటున్నారు. పవన్ మనసును అర్థం చేసుకోవడం కష్టమని, ఇన్నాళ్లకు తమ్ముడ్ని అర్థంచేసుకునే భార్య దొరికిందంటున్నాడు.

"పవన్ 4 పెళ్లిళ్లు చేసుకోలేదు. 3 మాత్రమే చేసుకున్నారు. పవన్ పెళ్లిళ్లపై మీరు విమర్శలు చేసి ఏం చేయలేరు. ఎందుకంటే కోర్టు ద్వారా నీట్ గా పరిష్కారమైన కేసు ఇది. అంతగా కెలుక్కోవాలనుకుంటే కెలుక్కోండి. మాకేం అభ్యంతరం లేదు."

పవన్ కు మెగాకాంపౌండ్ నుంచి పెద్దగా మద్దతు లేదంటున్నాడు నాగబాబు. దానికి కారణాలు కూడా చెబుతున్నాడు. ఇప్పుడున్న కాంపౌండ్ హీరోలకు జనసేనకు ప్రచారం కల్పించేంత సీన్ లేదంటున్నాడు.

"జనసేనకు మెగా కాంపౌండ్ నుంచి సరైన మద్దతు లేదు. అది నిజం. ఎందుకంటే చిరంజీవి కాంగ్రెస్ లో ఉన్నారు. పోనీ చరణ్, వరుణ్ లాంటోళ్లను పంపిద్దామంటే, జనాల్లోకి వెళ్లి మాట్లాడేంత కెపాసిటీ వాళ్లకు లేదు. వీళ్లు, నేను వెళ్లకపోయినంత మాత్రాన పవన్ కు వచ్చిన నష్టమేం లేదు. వీళ్లు పిల్లలు, వీళ్లు వెళ్లి చేసేదేం ఉండదు. ఈ పిల్లలకు అంత సీన్ లేదు. గ్లామర్ క్రియేట్ చేయడం తప్ప, ఇంపాక్ట్ క్రియేట్ చేయలేరు. నేను మాత్రం భవిష్యత్తులో వెళ్తాను."

ఇకపై చిరంజీవి రాజకీయాలు చేరని క్లారిటీ ఇచ్చాడు నాగబాబు. ఒకవేళ అన్నయ్య మళ్లీ పాలిటిక్స్ లోకి వెళ్తానంటే తను వారిస్తానంటున్నాడు. ప్రతి అడ్డమైన వెధవ కామెంట్ చేస్తుంటే అన్నయ్య తట్టుకోలేకపోయాడని చెప్పుకొచ్చాడు నాగబాబు.

తెలంగాణ తీర్పు ప్రభావం.. ఏపీపై ఉంటుందా? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్