Advertisement

Advertisement


Home > Politics - Political News

ఫస్ట్ పొలిటికల్ హీరో జగన్

ఫస్ట్ పొలిటికల్ హీరో జగన్

ఇలా అంటే చాలా మందికి కోపం రావచ్చు. లేదా చాలా మందికి డబ్బా కొట్టినట్లు అనిపించవచ్చు. కానీ ఇలా ఎందుకు అనాల్సి వచ్చిందో ఆ పాయింట్ గురించి ఆలోచించండి.

ఇండియాలో ఎక్కడ కాస్తయినా ప్రాధాన్యత వున్న ఏ ఎన్నికలు వచ్చినా, ఏ పార్టీ పోటీ చేసినా, అది జాతీయ పార్టీ, లోకల్ పార్టీ అయినా, వాటి అధినేత రంగంలోకి దిగని ఎన్నికలు వున్నాయా? వాటి అధినేత కనీసం ఓటర్లకు ఓ పిలుపు ఇవ్వని ఎన్నికలు జరిగాయా? వాటి అధినేత కనీసం ఓ పత్రికా ప్రకటన ఇవ్వకుండా ఎన్నికలు పూర్తయ్యాయా?

కేవలం ఆంధ్రలో అది కూడా ఇప్పుడు జరిగిన పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మున్సిపాల్టీ ఎన్నికలు కావచ్చు, కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు. వైకాపాకు పరువు ప్రతిష్టల సమస్య. తెలుగుదేశం సవాల్ చేస్తోంది. ఇటీవల కాలంలో కులం, మతం, దేవుళ్లు ఇలా చాలా రకాల కుట్రలు జరిగాయి. ఓ పక్క బాబు అనుకుల మీడియా దాడి నిత్యం వుండనే వుంది.

ఇలాంటి టైమ్ లో ఎన్నికలు వచ్చాయి. ముఖ్యంగా దశాబ్దాలుగా ఓ సామాజిక వర్గం గుప్పిట్లో గిలగిలలాడుతోంది విశాఖ. అక్కడ తమ పట్టు నిలబెట్టుకోవాలిన ఆ వర్గం నానా అబద్దాలు ప్రచారం చేస్తోంది. విశాఖ ఉక్కు సమస్య కు బాధ్యత జగన్ దే, విజయసాయిదే అన్నట్లు ప్రచారం సాగించింది.

మరోపక్క విజయవాడ, గుంటూరుల్లో చంద్రబాబు నానా శాపనార్థాలు. కానీ జగన్ చలించింది లేదు. పార్టీ ఎమ్మెల్యేలతో కావచ్చు, పార్టీ నాయకులతో కావచ్చు ఓ సమావేశం పెట్టిన దాఖలా లేదు. ఓ విడియో కాన్ఫరెన్స్ జరిపిన వైనం లేదు. పార్టీ మ్యానిఫెస్టో అన్నది లేనేలేదు. జగన్ గడప దిగలేదు. కనీసం ఓ విడియో బైట్ లేదు. ఓ ప్రెస్ మీట్ లేదు. ఆఖరికి ఓ పత్రికా ప్రకటన కూడా లేదు. 

టోటల్ క్లీన్ స్వీప్. ఇప్పుడు కూడా జగన్ ఇంకా ఓ మాట కూడా మాట్లడలేదు. ఇంతకన్నా హీరోయిజం ఏం వుంటుంది? అంబటి చెప్పినట్లు ఈ రాష్ట్రంలో నిజమైన హీరో ఎవరు అంటే జగన్ నే అనాలేమో?

అయన తప్ప..అంతా మోసగాలే

ఇదంతా జ‌గ‌న్ శ్ర‌మ ఫ‌లితమే.. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?