Advertisement

Advertisement


Home > Politics - Political News

కట్టలు తెంచుకున్న కోపం.. క్లాస్ పీకిన సీఎం

కట్టలు తెంచుకున్న కోపం.. క్లాస్ పీకిన సీఎం

అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పట్నుంచి శాంత స్వభావంతో, సహనంతో కనిపించారు సీఎం వైఎస్ జగన్. ప్రతిపక్షానికి కూడా కావాల్సినంత సమయం ఇస్తాం అర్థవంతమైన చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారు. ఇచ్చినమాట ప్రకారమే ప్రతిపక్షానికి కావాల్సినంత సమయం కూడా కేటాయించారు. బడ్జెట్ సమావేశాలప్పుడు కూడా ఈ ఆనవాయితీని కొనసాగించారు.

అయినా సరే పదే పదే జగన్ ప్రసంగానికి అడ్డుతగులుతూ సభలో రభస సృష్టించడానికి ప్రయత్నించారు టీడీపీ ఎమ్మెల్యేలు. ముఖ్యంగా అచ్చెన్నాయుడు హడావిడి అంతా ఇంతా కాదు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటూ రెచ్చిపోయారు. దీంతో ఓ దశలో జగన్ పూర్తిగా సహనం కోల్పోయారు. ప్రతిపక్షానికి తగిన సమయం కేటాయిస్తామని చెప్పినా, కేటాయిస్తున్నా కూడా ఇలా మాట్లాడ్డం సరికాదంటూ.. ఒకింత ఆగ్రహానికి గురయ్యారు.

మనిషి పెరిగావు కానీ నీకు బుద్ధి పెరగలేదంటూ అచ్చెన్నాయుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు సీఎం. అచ్చెన్నాయుడితో పాటు మిగతా టీడీపీ ఎమ్మెల్యేలను కూడా ఓ రౌండ్ వేసుకున్నారు. మీకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదని, టైమ్ ఇస్తామంటున్నా ఎందుకు ప్రసంగాలకు అడ్డు తగులుతారంటూ ప్రశ్నించారు.

జగన్ ఆగ్రహం చూసి టీడీపీ ఎమ్మెల్యేలు మొత్తం సైలెంట్ అయ్యారు. ముఖ్యంగా అచ్చెన్నాయుడికి పడ్డ పంచ్ లు చూసి వైసీపీ ఎమ్మెల్యేలు నవ్వుకున్నారు. అచ్చెన్న కూడా ఏం చేయలేక సైలెంట్ అయ్యారు. మొత్తమ్మీద సమావేశానికి పూర్తిగా సిద్ధమై వచ్చిన జగన్ సాధికారికంగా సభని కంట్రోల్ చేయగలిగారు. టీడీపీ ఎమ్మెల్యేల స్పీడ్ కి ఎక్కడికక్కడ బ్రేకులు వేశారు.

బాబు భ్రమలను నమ్మని జనం.. వికేంద్రీకరణకే జగన్‌ మొగ్గు?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?