Advertisement

Advertisement


Home > Politics - Political News

ప్రాజెక్ట్ వద్దకు వెళ్లి ఆ మాట చెప్పే దమ్ముందా

ప్రాజెక్ట్ వద్దకు వెళ్లి ఆ మాట చెప్పే దమ్ముందా

అ అంటే అమరావతి, ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అంటూ అప్పట్లో టీడీపీ నేతలు తెగ ఊదరగొట్టారు. ఇప్పుడు ఏపీ టీడీపీ నూతన అధ్యక్షుడు ఏపీ అంటే మరో అర్థం ఉందని చెబుతున్నారు. ఎ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని సెలవిచ్చారు అచ్చెన్నాయుడు. అంతే కాదు అచ్చెన్న మరో కొత్త విషయాన్ని కూడా కనిపెట్టారు. అమరావతి, పోలవరం రెండూ పూర్తయితే చంద్రబాబుకి ఎక్కడ మంచి పేరొస్తుందో అనే భయంతోనే జగన్ వాటిని పక్కనపెట్టేశారని మండిపడ్డారు.

పోనీ నిజంగానే చంద్రబాబుకి మంచి పేరొస్తుందని జగన్ వాటిని పట్టించుకోవడంలేదనుకుందాం. అలాంటప్పుడు పోలవరం  పనులు 70 శాతం పూర్తయ్యాయి అని చెబుతున్న టీడీపీకి ప్రాజెక్ట్ వద్దకు వెళ్లి నిర్మాణాన్ని చూపించి, 70 శాతం అనే మాట చెప్పే దమ్ముందా? అమరావతి గురించి అడిగితే గ్రాఫిక్స్ చూసుకోమంటారు, పోలవరం గురించి మాట్లాడితే.. పేపర్ మీద 70 శాతం పూర్తయింది అని అంటారు. 

30శాతం నిధులతో 70శాతం ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసిన చంద్రబాబుని మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.  అసలు చంద్రబాబు సోమవారాన్ని "పోలవారం"గా ఎందుకు మార్చారో తెలుసుకోవాలంటే.. పోలవరం దగ్గర జరిగిన భజనల్ని మనం వినాల్సిందే. 

సోమవారం శివుడికి, మంగళవారం ఆంజనేయ స్వామికి, శనివారం వెంకటేశ్వరుడికి భజనలు జరిగినట్టు.. పోలవారం రోజున.. జయము జయము చంద్రన్నా అంటూ పోలవరం ప్రాజెక్ట్  దగ్గర భజనలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేసేవారు. ప్రభుత్వ ఖర్చుతో పోలవరం సందర్శన అంటూ ఏసీ బస్సుల్ని ఖాళీగా తిప్పి చంద్రబాబు నిధుల్ని ఫలహారం చేశారు.

ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ ముద్దు అంటూ.. ప్యాకేజీకి, హోదాకి సంబంధం లేని పోలవరాన్ని తాకట్టు పెట్టారు. అన్ని చేసిన టీడీపీ.. ఇప్పుడు పోలవరం పనులు ముందుకు సాగడం లేదని, జగన్ కావాలని ప్రాజెక్ట్ పనుల్ని ఆలస్యం చేస్తున్నారంటూ ఆరోపణలు చేయడాన్ని ఏమనుకోవాలి.

కొత్త పదవి రాగానే.. ఏంచేయాలో తెలియక.. ఇలా అవాకులు చవాకులు పేలుతున్నారు అచ్చెన్నాయుడు. పోలవరంపై మంత్రి అనిల్ అంత క్లారిటీగా చంద్రబాబు తప్పుల్ని, డాక్యుమెంట్లతో సహా ఎత్తి చూపినా కూడా.. మరోసారి అచ్చెన్నాయుడు దుష్ప్రచారానికి తెరతీశారు. 

ఇది టీడీపీ కాదు కరణం గారూ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?