Advertisement

Advertisement


Home > Politics - Political News

బాబు పిలుపు బేఖాతర్.. ‘గంట’ మోగడం లేదు!

బాబు పిలుపు బేఖాతర్.. ‘గంట’ మోగడం లేదు!

చంద్రబాబునాయుడు పేరుకే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు.. కానీ, ఆ పార్టీలోనే ఆయనను మనస్ఫూర్తిగా ఖాతరుచేస్తున్న వారిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో కూడా అవసాన దశలో ఉన్న ఆ పార్టీకి జాతీయ పార్టీ అనే హోదా తగిలించి.. తాను జాతీయ అధ్యక్షుడిని అని చంద్రబాబు చాలా ఘనంగా చెప్పుకోవచ్చు గాక.. కానీ.. చంద్రబాబును పట్టించుకుంటున్న దిక్కు మాత్రం లేదు. తాజాగా తనను కలవాలని నేతలను పురమాయిస్తే.. ‘వీలున్నప్పుడు వస్తాం’ అంటూ వారినుంచి వచ్చిన జవాబులే ఇందుకు నిదర్శనం. 

తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటూ రాజకీయ మనుగడ కాపాడుకుంటోంది. అంతే తప్ప పార్టీలో ఉన్న చాలా మంది కీలక నాయకులు, కార్యకర్తలకు మాత్రం.. పార్టీ భవిష్యత్తు మీద ఆశలుడిగిపోయాయి. ఇప్పుడు శవాసనం వేసి ఉన్న పార్టీ మళ్లీ లేచి నిలబడుతుందనే ఆశ లేదు. అందుకే పార్టీ పదవులు ఇచ్చినా, ప్రజలు గెలిపించినా కూడా పార్టీతో మాత్రం అంటీముట్టనట్టుగా దూరందూరంగా ఉంటున్నారు. అలాంటి వారిలో విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా ఒకరు. 

ఆయన టీడీపీ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత.. ఇప్పటిదాకా పార్టీని పట్టించుకున్నది లేదు. తనకు– పార్టీకి సంబంధం లేదు అన్నట్టుగానే వ్యవహరిస్తుంటారు. తాజాగా చంద్రబాబు నాయుడు పార్టీని పట్టించుకోకుండా ఉన్న చాలా మంది నాయకులకు పిలుపులు పంపారు. స్వయంగా వచ్చి తనను కలవాలని హుకుం జారీ చేశారు. మిగిలిన వాళ్ల సంగతి ఎలా ఉన్నా.. గంటా శ్రీనివాసరావు ఈ పిలుపును కూడా పట్టించుకోలేదు. ‘కాస్త బిజీగా ఉన్నా ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి కలుస్తా’ అనే సందేశాన్ని మరో రకం మాటలద్వారా తెలియజేశారు. 

మొత్తానికి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నదంటే.. పార్టీని కాదనుకున్న వారు కొందరు ఆల్రెడీ వైసీపీలోకి వెళ్లిపోయారు. వైసీపీలోకి వెళ్లడానికి ఓకే గానీ.. లోకల్ ఈక్వేషన్స్ ను బట్టి.. భవిష్యత్తు కష్టం అని భయపడుతున్న వాళ్లు.. అటు పార్టీ మారకుండా ఇటు టీడీపీనీ పట్టించుకోకుండా కాలం గడుపుతున్నారు. చివరికి తెలుగుదేశంలో తండ్రీ కొడుకులు– వారి అడ్డగోలు భజన బృందం మాత్రమే మిగిలినా ఆశ్చర్యం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

రాజుగారిని బాబు భుజానమోస్తున్నారు.. సంగతేంటో..?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని చికాకు పెట్టడం ఒక్కటే తన జీవిత లక్ష్యంగా నడుచుకుంటూ ఉండే ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజును వెనుకనుంచి నడిపిస్తున్నది ఎవరు? అనే సందేహం చాలా మందికి చాలా సందర్భాల్లో కలుగుతూ ఉంటుంది. రాజుగారు మాత్రం.. చాలా తరచుగా ఢిల్లీలోని కమలదళం పెద్దలను కలుస్తూ ఉండడం ద్వారా.. తనకు బీజేపీ అండదండలు ఉన్నాయనే సంకేతాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. 

వాస్తవంలో ఆయన చంద్రబాబునాయుడు స్కెచ్ ప్రకారమే నడుచుకుంటూ ఉంటారనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. అలాంటి అనుమానాలు నిజమే అనిపించేలా.. ఇప్పుడు రఘురామకృష్ణ రాజు కు అనుకూలంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతున్నారు.  కోర్టుల్లేకపోతే.. రఘురామకృష్ణరాజును చంపేసి ఉండేవాళ్లని ఆయన సానుభూతి వ్యక్తం చేయడం చాలా కామెడీగా ఉంది. దీని వెనుక బాబు గారికి పెద్ద వ్యూహమే ఉన్నట్టుగా ఉంది.

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా