Advertisement

Advertisement


Home > Politics - Political News

క్రమబద్ధీకరించాలని జగన్ దగ్గరకూ గీతం భూముల ఫైల్...?

క్రమబద్ధీకరించాలని జగన్ దగ్గరకూ గీతం భూముల  ఫైల్...?

విద్యా సంస్థలు ఉన్నవి బోధనకు, భావి పౌరులను తయారు చేయడానికి, వాటి ఉద్దేశ్యాలు మంచివి కాబట్టి ఉదారంగా ఏ ప్రభుత్వం అయినా కూడా నామ మాత్రపు ధరకు సర్కార్ భూములు ఇస్తాయి. ఇది జనహితం కోసం.

కానీ అవే భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటే కుదిరే పని కాదు కదా. పైగా అది లక్ష్యానికి విరుధ్ధం కూడా అవుతుంది. ఇదంతా ఎందుకంటే విశాఖలోని గీతం విద్యా సంస్థల భూముల విషయంలో 43 ఎకరాల భూములు అక్రమం అని వైసీపీ  ప్రభుత్వం తేల్చింది. దాన్ని స్వాధీనం చేసుకోవాలని చర్యలు దిగింది.

అయితే గీతం విద్యా సంస్థలకు 71 ఎకరాల భూములను ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చింది. అది చాలదన్నల్టుగా మరో 43 ఎకరాల భూమిని ఆక్రమించి దాన్ని క్రమబద్ధీకరించమని గత టీడీపీ ప్రభుత్వం టైం నుంచి ఇప్పటిదాకా  ప్రయత్నం చేస్తూ వచ్చిందని వైసీపీ నేతలు చెబుతున్నారు.

చంద్రబాబు హయాంలో అఖరి క్యాబినెట్ మీటింగులో కూడా ఈ ఫైల్ మీద నిర్ణయం తీసుకోవాలనుకున్నా చివరి  నిముషంలో వాయిదా వేశారట. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక కూడా ఇదే ఫైల్ వైసీపీ సర్కార్ చుట్టూ తిరిగిందట.

ఈ ఏడాది ఆగస్ట్   3న వైసీపీ ప్రభుత్వాన్ని కూడా గీతం యాజమాన్యం తమ స్వాధీనంలో ఉన్న భూములను క్రమబద్ధీకరణ చేయమంటూ విన్నపాలు చేసుకుంటూ ఫైల్ పంపిందంట. తాజాగా దీన్ని వెల్లడించిన వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ తమ ప్రభుత్వం ఆ ఫైల్ ని తిరస్కరించిందని చెప్పుకొచ్చారు.

గీతం వంటి సంస్థలకు ఇప్పటికే కావాల్సినంత భూమిని ప్రభుత్వాలు ఇచ్చాయని, ఇంకా ఎందుకంత భూదాహం అని ఆయన ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ బిజినెస్  చేస్తామంటే చూస్తూ ఊరుకుంటామా అని ఆయన అంటున్నారు.

తాము పేదలకు గీతం నుంచి స్వాధీనం చేసుకున్న భూములు పంచుతామని ఆయన చెబుతున్నారు. మొత్తానికి జగన్ దగ్గరకు కూడా గీతం ఫైల్ వచ్చినా నో చెప్పి మరీ యాక్షన్ కి దిగారన్న మాట.

గ్రేట్ ఆంధ్రా వచ్చిందే అందుకని తెలుసు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?