cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

సర్కార్ వారి చేపలు

సర్కార్ వారి చేపలు

ఇచ్చట చేపలు అమ్మబడును అన్న బోర్డులు ఎక్కడ చూసినా  చాలా కామన్ గా  కనిపిస్తాయి. కానీ సర్కార్ వారి చేపలు అమ్మబడును అన్న బోర్డులు కూడా ఇపుడు కనిపిస్తున్నాయి. లైవ్ ఫిష్, నాణ్యమైన చేపలు తక్కుగ ధరలకు అందిస్తామని సర్కార్ వారి చేపల బజార్  చెబుతోంది.

విశాఖలోని పెదగంట్యాడ మండలంలో ప్రభుత్వ చేపల దుకాణాన్ని తాజాగా ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈ చేపల ఔట్ లెట్ ని  ఏర్పాటు చేసినట్లుగా మత్స్యశాఖ  అధికారులు తెలిపారు. 

రాష్ట్రంలోనే మొదటిసారిగా ప్రయోగాత్మకంగా ఈ ఔట్ లెట్ ని ఏర్పాటు చేసినట్లుగా వారు చెప్పారు. మన చేప మన ఆరోగ్యం కింద ఈ పధకానికి శ్రీకారం చుట్టినట్లుగా అధికారులు పేర్కొన్నారు.

మొత్తానికి ఈ ఔట్ లెట్ కి డిమాండ్ ని చూసి మిగిలిన చోట్ల కూడా విస్తరిస్తామని అధికారులు చెబుతున్నారు. మొత్తానికి విశాఖలో ఏర్పాటు చేసిన  సర్కార్ వారి చేపల ఔట్ లెట్ కి జనాదరణ ఎలా ఉంటుందో  వేచి చూడాల్సిందే.

లవ్ స్టొరీ లకు ఇక గుడ్ బై

వైఎస్సార్ కారు నడిపాను

 


×