Advertisement

Advertisement


Home > Politics - Political News

ఉద్యోగులూ.. వారి ట్రాప్ లో పడొద్దు

ఉద్యోగులూ.. వారి ట్రాప్ లో పడొద్దు

మొన్న పీఆర్సీ కోసం ఉద్యోగుల మౌనపోరాటం చూశాం, నిన్న నల్ల బ్యాడ్జీలతో సచివాలయ ఉద్యోగుల నిరసన చూశాం, ఇప్పుడు విషయం రసకందాయంలో పడింది. కలెక్టరేట్ల ముట్టడితో ఉద్యోగుల్లో గూడుకట్టుకుని ఉన్న ఆందోళన, అసహనం అన్నీ బయటపడ్డాయి. 

అంతే కాదు.. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న మహిళలు కూడా ఊ అంటావా.. ఊఊ అంటావా సీఎం అంటూ ఐటంసాంగ్స్ పాడుతున్నారంటే.. వారి నిరసన ఎక్కడో శృతి మించుతున్నట్టే అర్థమవుతోంది. ఇంతకీ ఉద్యోగులు తమ జీతాల కోసం పోరాటం చేస్తున్నారా..? ప్రతిపక్షాల మాయలోపడి అధికారంలో ఉన్న పార్టీపై, ముఖ్యమంత్రిపై అనుచిత ప్రేలాపనలు పేలుతున్నారా..?

అర్థం చేసుకోండి అన్నారు.. అంతేగా..?

ఉద్యోగులకు పెరగాల్సిన జీతాలు కచ్చితంగా పెరగాల్సిందే. అయితే అదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ప్రభుత్వం ఈసారి కాస్త అడ్జస్ట్ కావాలి అని అడిగింది. అంతే కదా..? ఇష్టముంటే ఓకే అనాలి, లేకపోతే శాంతియుతంగా నిరసన తెలియజేయాలి, మళ్లీ చర్చలకు కూర్చోవాలి. కాదు కూడదు అని ఇలా కలెక్టరేట్లపైకి దండెత్తితే ఎవరికి నష్టం, ఎవరికి లాభం..?

ఏకపక్షంగా నిర్ణయం తీసుకోబోమని, ఉద్యోగుల సమస్యలపై కచ్చితంగా చర్చిస్తామని అన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. పీఆర్సీతోపాటు, హెచ్ఆర్ఏ విషయంలోనూ అన్ని ఉద్యోగ సంఘాలతో మాట్లడాతమని చెప్పారాయన. ఉద్యోగులు మొండి వైఖరితో ఉండొద్దని కోరారు.

చంద్రబాబు సంగతి మీకు తెలియదా..?

గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగుల్ని ఎలా తూలనాడారనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. దాని గురించి కూడా శ్రీకాంత్ రెడ్డి ప్రస్తావించారు. మిమ్మల్ని ద్వేషించి, అసభ్యపదజాలంతో దూషించిన వారి ట్రాప్ లో పడొద్దు అని ఉద్యోగులకు సూచించారు. జగన్ కి చిత్తశుద్ధి ఉంది కాబట్టే, అధికారంలోకి వచ్చిన వెంటనే లక్షా 30వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పే స్కేల్ అమలు చేసిన ప్రభుత్వం తమదేనని గుర్తు చేశారు.

అనుకున్నదానికంటే ఐఆర్ పెంచి ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం కూడా 27శాతం ఐఆర్ ప్రకటించలేదని ఆయన చెప్పారు. ప్రభుత్వంపై 10వేల కోట్ల రూపాయల భారం పడుతున్నా పీఆర్సీ ప్రకటించిందని ఉద్యోగులు అర్థం చేసుకోవాలన్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?