Advertisement

Advertisement


Home > Politics - Political News

ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల వైపా, కార్పొరేట్ల వైపా..?

ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల వైపా, కార్పొరేట్ల వైపా..?

క‌రోనా వ్యాక్సిన్ ఫార్ములాను పేటెంట్ లు ఉన్న కంపెనీ లు వెంటనే బయటపెట్టాలి. ఇలా చేస్తే మిగతా అనేక సంస్థలు అతి వేగంగా వాక్సిన్ ను ఉత్పత్తి చేసే వీలవుతుంది. శరవేగంగా దేశ /ప్రపంచ ప్రజానీకానికి మొత్తం వాక్సిన్ వేసే వీలవుతుంది.

ఈ పని చెయ్యక పోవడం వలన ఇప్పటికే సెకండ్ వేవ్ లో అనేక మంది అభాగ్యులు బలయ్యారు. దాదాపు ప్రతి కుటుంబం కడగండ్ల పాలయ్యారు. అవుతున్నారు. మూడో వేవ్ సిద్దంగా ఉంది. ఈ సారి అభం,శుభం తెలియని పిల్లలు ఇబ్బందులకు గురికావచ్చని నిపుణులు భయపెడుతున్నారు.    

ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఏం లెక్కలు వేసుకుంటున్నారు?  మానవ జాతి శ్రమించి ,సృష్టించిన సైన్స్ భుజాలపైకి ఎక్కి తామేదో ఊడ బొడిచామనే కంపెనీల కాసుల కక్కుర్తిని ప్రభుత్వాలెందుకు సహించాలి?ప్రభుత్వ రంగ సహకారాలతో,నిధులతో తయారయిన వాక్సిన్ లపై ఒకరిద్దరు ప్రైవేటు వ్యక్తులకు మాత్రమే ఎట్లా హక్కులుంటాయ్? ఉంటే మాత్రమేమిటి?  

కోట్ల ప్రజల కలలకు వ్యతిరేకంగా పార్లమెంటు చట్టాలు చేసిన చరిత్ర మనది.గుప్పెడు మంది ప్రైవేటు వ్యక్తుల అత్యాశలకు వ్యతిరేకంగా శాసనాలు చెయ్యలేరా? రాజకీయ అవసరాలకోసం ఎవడ్ని బడితే వాడిని బ్లాక్ మెయిల్ చేసి పబ్బం గడుపుకుంటున్నారు.

ప్రజా శ్రేయస్సు కోసం నయాన్నో, భయాన్నో ఈ కంపెనీలను లొంగ దియ్యలేరా?!  ప్రజాగ్రహానికి భయపడి కనీసం ఇదొక్కసారన్నా నిర్ణయం చేస్తారా? 'నాయకులం' అని అనుకునే వారు కార్పొరేట్ల వైపో,ప్రజల వైపో తేలిపోయే సమయం వచ్చేసింది. ఆ వైపునుంటారా? ఈ వైపునుంటారా?

- Dr.C.Obula Reddy,Kadapa.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?