cloudfront

Advertisement


Home > Politics - Political News

గ్రాఫిక్స్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు.!

గ్రాఫిక్స్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు.!

మే 23న వచ్చే ఫలితాల్ని బట్టి, ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడాలి. ఈలోగా పాత ప్రభుత్వానికి 'అధికారాల' విషయంలో కొన్ని కోతలుంటాయి.. ప్రభుత్వ కార్యకలాపాలు కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకూ యధాతథంగా కొనసాగుతాయి.. కానీ, ఆ ప్రభుత్వాన్ని నడపాల్సిన రాజకీయ పెద్దల విషయంలోనే కొన్ని ఆంక్షలుంటాయి. అదే ఎన్నికల కోడ్‌. కానీ, తెలుగుదేశం పార్టీ ఆ 'ఎన్నికల కోడ్‌'ని లెక్క చేయడంలేదు.

దేశంలో ఏ వ్యవస్థ మీదా తెలుగుదేశం పార్టీకి సరైన అభిప్రాయం లేదు. సీబీఐ కావొచ్చు, ఈడీ కావొచ్చు, న్యాయవ్యవస్థ కావొచ్చు.. ఎన్నికల కమిషన్‌ కావొచ్చు.. అన్నిటి విషయంలోనూ దాదాపు ఒకటే వైఖరితో కన్పిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. అధినేత చంద్రబాబు ఎలా నడిస్తే, తెలుగు తమ్ముళ్ళు కూడా అదేబాటలో నడవాలి కదా.! అదే చేస్తున్నారిప్పుడు. పోలింగ్‌కి ముందునుంచే ఎన్నికల కమిషన్‌పై 'గురి'పెట్టిన పచ్చదండు, పోలింగ్‌ పూర్తయిపోయిన తర్వాత కూడా 'యుద్ధం' కొనసాగిస్తూనే వున్నారు.

చీఫ్‌ సెక్రెటరీ అనే ఉన్నతాధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి లోబడి పనిచేయాల్సి వుంటుంది. కానీ, చంద్రబాబు అండ్‌ టీమ్‌ మాత్రం తాము చెప్పినట్లే అన్ని వ్యవహారాలూ నడవాలని కోరుకుంటున్నారు. రోజుకో కొత్త వివాదం తెరపైకొస్తోంది తెలుగు తమ్ముళ్ళ నుంచి. 'మా టర్మ్‌ పూర్తయ్యేదాకా మేం చేయాల్సిన పెత్తనం చేస్తూనే వుంటాం..' అంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు. ప్రస్తుతానికి చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మాత్రమే. ఆయనకీ ఆ విషయం తెలుసు. కానీ, ఏదో 'భ్రమలో' బతికేస్తున్నారాయన. చంద్రబాబే ఇలా వుంటే, తెలుగు తమ్ముళ్ళు ఇంకెంతలా ఊహల పల్లకీలో ఊరేగుతారు.? ఊహించుకోవడమెందుకు, ఆల్రెడీ చూసేస్తున్నాం కదా.!

వైసీపీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సోషల్‌ మీడియాలో ఓ ట్వీటేశారు. ఓ సినీ దర్శకుడితో సచివాలయం సెట్‌ వేయించుకుంటున్నారు, ఫలితాలొచ్చాక ఓడిపోయామని తెలిసినా చంద్రబాబు ఆ సచివాలయం సెట్‌లో ముఖ్యమంత్రిగా పండగ చేసుకుంటారన్నది ఆ ట్వీట్‌ సారాంశం. దీన్ని ఓ రాజకీయ విమర్శగా మాత్రమే తీసుకోలేం. చంద్రబాబు మానసిక స్థితికి దగ్గరగానే వుంది ఈ ట్వీట్‌. ఈ అభిప్రాయంతో చాలామంది ప్రజలు ఏకీభవిస్తున్న పరిస్థితి కన్పిస్తోంది.

రాజధాని అమరావతిని సినిమాటిక్‌ గ్రాఫిక్స్‌తో ప్రజలకు చూపించిన చంద్రబాబు, ఓడిపోయాక సెట్‌ నిర్మించుకుని.. అక్కడ తన రాజ్యానికి తానే ముఖ్యమంత్రిలా వుంటారా.? లేదంటే, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో వర్చువల్‌ సెటప్‌ చేసుకుని ముఖ్యమంత్రిలా ఫీలవుతారా.? అన్నది వేచి చూడాల్సిందే.  

తెలుగుదేశంలోనూ విజయం మీద ఫుల్ కాన్ఫిడెన్స్!

నాని ఇంటర్వ్యూలో చెప్పినట్లు జెర్సీ సినిమా ఉందా?