cloudfront

Advertisement


Home > Politics - Political News

గ్రేట్‌ఆంధ్ర గ్రౌండ్‌ రిపోర్ట్‌ : రాయదుర్గం

గ్రేట్‌ఆంధ్ర గ్రౌండ్‌ రిపోర్ట్‌ : రాయదుర్గం

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా విజయం సాధించిన నియోజకవర్గాల్లో ఒకటి రాయదుర్గం. ఆఖరివరకూ పోటీచేయడానికి అభ్యర్థులు ఎవరూ ముందుకు రాకపోవడంతో.. మాజీఎంపీ కాలువ శ్రీనివాసులును ఇక్కడ పోటీచేయించారు చంద్రబాబు నాయుడు. ఇక్కడ అంతకు రెండేళ్ల కిందట జరిగిన ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించడంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి రామచంద్రరెడ్డి అతి విశ్వాసానికి లోనయ్యారు. ఫలితంగా తెలుగుదేశం విజయం సాధించింది.

-రుణమాఫీ వంటి హామీ అప్పుడు గణనీయంగా ప్రభావం చూపించింది.
-వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి తను ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదని, విజయం తనదే అని అనుకున్నారు.
-అనంతపురం ఎంపీ సీటు నుంచి జేసీ పోటీచేయడం అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇక్కడ లాభం చేకూర్చింది.

ఈసారి డిసైడింగ్‌ ఫ్యాక్టర్లు ఇవే..
-కాలువ శ్రీనివాసులు మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. భారీగా అవినీతి సంపాదన విషయంలో ఈయనపై తీవ్రమైన ఆరోపణలున్నాయి.
-రుణమాఫీ వంటి విషయాల్లో కూడా ప్రభుత్వ తీరుపై వ్యతిరేకత ఉంది.
-తెలుగుదేశం పార్టీలో అంతర్గత విబేధాలు తీవ్రస్థాయికి చేరాయి. ఇటీవలే సీనియర్‌ నేత మెట్టు గోవిందరెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు.
-ఆయన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరడం ఆ పార్టీకి లాభించే అంశమే. ఇక ఇక్కడ కాలువను ఓడించడానికి కంకణం కట్టుకున్నాడు దీపక్‌ రెడ్డి.
-దేశంలోనే అత్యంత ధనిక రాజకీయ నేతల్లో ఒకరైన దీపక్‌రెడ్డి ఇక్కడ ఇండిపెండెంట్‌గా పోటీచేస్తూ ఉన్నారు. ఒకసారి కాలువను ఓడిస్తే మళ్లీ తెలుగుదేశం అభ్యర్థిత్వం తనకే దక్కుతుందనే భావనతో ఉన్నారాయన.
-ఇక గత ఎన్నికల్లో అతివిశ్వాసంతో దెబ్బతిన్న కాపు రామచంద్రరెడ్డి ఈసారి మాత్రం జాగ్రత్తగా పనిచేసుకొంటూ ఉన్నారు. చాన్నాళ్ల నుంచి కార్యకర్తలను, కేడర్‌ను కలుపుకుని పోయి.. జయకేతనం ఎగరేసేందుకు వర్క్‌ చేసుకొంటూ ఉన్నారు.

'గ్రేట్‌ఆంధ్ర' సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి..
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ - 56
తెలుగుదేశం పార్టీ -40
ఇతరులు -04

అమరావతి ప్రస్తావన లేని ఎన్నికలు!