cloudfront

Advertisement


Home > Politics - Political News

హద్దులు దాటేసిన చంద్రబాబు అసహనం

హద్దులు దాటేసిన చంద్రబాబు అసహనం

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు 'అసహన' రాజకీయాలతో విసుగు తెప్పించేస్తున్నారు జనాలకి. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు ఎక్కడికి వెళ్ళినా ఒకటే తంతు. ఐదేళ్ళ పాలనలో రాష్ట్రానికి ఏం వెలగబెట్టారో చెప్పాల్సింది పోయి, పొరుగు రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రిని విమర్శించడం, ఎక్కడో బీహార్‌లో రాజకీయాలు చేసుకుంటోన్న ప్రశాంత్‌ కిషోర్‌ని దూషించడం.. ఇదేపనిగా పెట్టుకున్నారు చంద్రబాబు.

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మీద చంద్రబాబు విమర్శలు ఈనాటివి కావు. కొత్తగా ఆయన జగన్‌ మీద చేయడానికి విమర్శలేమీ లేవు కాబట్టి, కొత్త కొత్త అంశాల్ని తెరపైకి తెస్తున్నారు. ఇటీవల హత్యకు గురైన వైఎస్‌ వివేకానందరెడ్డి పేరు ప్రస్తావిస్తూ ఎన్నికల ప్రచార సభల్లో చిరాకు పుట్టించేస్తున్నారు చంద్రబాబు. 'వాళ్ళే చంపేసి, వాళ్ళే ప్రభుత్వానికి ఆ హత్యను అంటగడుతున్నారు..' అన్నట్లుగా చంద్రబాబు చేస్తున్న విమర్శలతో జనం ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది.

ఇక, ప్రశాంత్‌ కిషోర్‌ విషయంలో అయితే చంద్రబాబు దూకుడు మరీ దారుణంగా తయారైంది. 'డెకాయిట్‌' అంటూ పదే పదే ప్రశాంత్‌ కిషోర్‌ని విమర్శిస్తున్నారాయన. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి గతంలో ప్రశాంత్‌ కిషోర్‌ 'సలహాదారు'గా వ్యవహరించిన మాట వాస్తవం. అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. అక్కడికేదో ప్రశాంత్‌ కిషోర్‌ ఆధ్వర్యంలో ఓట్ల తొలగింపు జరిగిపోయిందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ఇంకోపక్క రాష్ట్ర ఎన్నికల అధికారి అసలు ఓట్లు తొలగించబడలేదు మొర్రో అంటున్నారాయె.

మొత్తమ్మీద, ఏ సర్వే కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా లేకపోవడంతో చంద్రబాబు ఏదో ఒకఅంశం పట్టుకుని జనం మైండ్‌సెట్‌ని డైవర్ట్‌ చేసెయ్యాలనే ఆలోచనతో వున్నట్లు కన్పిస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం తనకుందని పదే పదే చెప్పుకునే చంద్రబాబు, హుందాతనం గురించి ఎప్పటికప్పుడు క్లాసులు పీకే చంద్రబాబు.. ఇలా అసహన రాజకీయాలతో ఊగిపోతుండడం హాస్యాస్పదం కాక మరేమిటి.?

ప్రత్యేకహోదా అంశం అటకెక్కిపోయింది.. రాజధాని అమరావతి ఊసేలేదు. పోలవరం ప్రగతి గురించిన ప్రస్తావనే రావడంలేదాయె. వీటన్నిటినీ మించి ఇతర అంశాల మీదనే చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా ఆధారపడినట్లున్నారు. లేకపోతే వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య గురించీ, ప్రశాంత్‌ కిషోర్‌ 'డెకాయిటీ' వ్యవహారం గురించీ, కేసీఆర్‌ రిటర్న్‌ గిఫ్ట్‌ గురించీ గుండెలు బాదుకోవడమేంటట.? 'ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై మాకు ఆసక్తిలేదు' అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించాకా చంద్రబాబు, టీఆర్‌ఎస్‌ జపం చేస్తున్నారంటే ఆ స్థాయిలో చంద్రబాబు భయపడుతున్నారన్నమాట.

చంద్రబాబు నిర్ణయాల పలితం-శక్తిమంతంగా KCR 

యాత్ర సినిమా సగటు విజయం ఏం చెప్తోంది?