cloudfront

Advertisement


Home > Politics - Political News

రాస్కోండి.. ఆంధ్రలో చంద్రబాబు చిత్తుగా ఓడిపోతాడు

రాస్కోండి.. ఆంధ్రలో చంద్రబాబు చిత్తుగా ఓడిపోతాడు

ఏపీలో ఎన్నికలపై తెలంగాణ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు చిత్తుగా ఓడిపోతారని జోస్యం చెప్పారు. చంద్రబాబు మోసాల్ని ఏపీ ప్రజలు ఇక ఎంతమాత్రం భరించరని అంటున్నారు హరీష్.

"చంద్రబాబు అంటేనే మోసం. మాట మాట్లాడితే మోసం, ప్రతి అడుగులో మోసం, ప్రతి పనిలో మోసం. బాబు మాట్లాడేది చేయడు, చేసేది మాట్లాడడు. ఆంధ్రప్రదేశ్ లో అందర్నీ మోసం చేశారు చంద్రబాబు. రైతు రుణమాఫీ అనిచెప్పి మోసంచేశాడు. డ్వాక్రా మహిళలకు మాఫీ అనిచెప్పి మోసంచేశాడు. అడుగడుగునా మోసమే. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు చిత్తుచిత్తుగా ఓడిపోతారు."

చంద్రబాబు మాటలోనే మోసం దాగుందన్నారు హరీష్. తనపాలనలో కంప్యూటర్లు పట్టుకొని తిరిగారే తప్ప, ఏనాడు పేదోడి పొట్ట చూడలేదని బాబుపై విమర్శలు గుప్పించారు. "చంద్రబాబు కంప్యూటర్ పట్టుకొని అంతా ఇదే అంటాడు. అది అన్నంపెట్టదు. పేదోడి కడుపు నింపదు. అంతా కంప్యూటర్ అని చెప్పి ఆయనకు ఆయన మోసం చేసుకుంటున్నాడు. ప్రజల్ని మోసం చేస్తున్నాడు."

చంద్రబాబుతో కలిసిన కాంగ్రెస్ భూస్థాపితం అవ్వడం గ్యారెంటీ అన్నారు హరీష్. బాబుతో ఎవరు పెట్టుకున్నా వాళ్లు ఎదగలేరని అన్నారు. తెలంగాణ ప్రజలకు ముఖం చూపించలేని చంద్రబాబు, ఇప్పుడు కాంగ్రెస్ ముసుగు కప్పుకొని వస్తున్నారని ఎద్దేవా చేశారు హరీష్.

"సిగ్గులేని చంద్రబాబు ఢిల్లీకి పోయి సోనియా, రాహుల్ తో సమావేశమయ్యారు. సోనియాగాంధీని ఇటలీ దెయ్యం అన్నాడు. అప్పుడు ఇటలీ దెయ్యమైన సోనియా, ఇప్పుడు దేవత ఎలా అయిందో చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఇది పూర్తిగా అవకాశవాదం. తెలంగాణలో చంద్రబాబు చెల్లని రూపాయి. అందుకే కాంగ్రెస్ ముసుగుతో వస్తున్నారు. ఇతడ్ని నమ్మొద్దు."

మహాకూటమి పేరుతో వందమంది కలిసినా కౌరువుల్లా ఓడిపోతారని, చివరికి పాండవుల్లాంటి టీఆర్ఎస్ నేతలే గెలుస్తారని అంటున్నారు హరీష్. 

తమ్ముడి రాజకీయం కోసం చిరు సహకారం.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్