cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

ఇది టీజర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది

ఇది టీజర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది

ఇన్నాళ్లూ వ్యవస్థల పేరుతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూసిన టీడీపీ.. దాదాపుగా ఆ విషయంలో విజయవంతమైంది. హైకోర్టు తీర్పులతో ప్రభుత్వానికి మొట్టికాయలు వేయించి మరీ రాక్షసానందాన్ని పొందింది. తీర్పులను విమర్శించే సాహసం చేసిన వారిపై కేసులు పెట్టడంతో ఎవరూ మారు మాట్లాడలేకపోయారు. 

సాక్షాత్తూ సీఎం జగన్ కలుగజేసుకుని సుప్రీం చీఫ్ జస్టిస్ కి లేఖ రాయడంతో వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ చర్చ కొనసాగుతుండగానే.. ఏపీ హైకోర్టు జడ్జీలు బదిలీపై వెళ్లడం వంటి కీలక పరిణామాలు జరిగాయి.

ఇక ఇప్పుడు అసలు విషయానికొద్దాం.

తొలిసారిగా ఏపీ హైకోర్టులో ప్రభుత్వానికి సానుకూలంగా ఓ తీర్పు వచ్చింది. కరోనా వేళ స్థానిక ఎన్నికల కోసం పట్టుబడుతున్న కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయాన్ని తిప్పికొడుతూ.. ప్రజారోగ్యమే ముఖ్యమని చాటిచెబుతూ.. ఎన్నికల నోటిఫికేషన్ ని కొట్టేశారు సింగిల్ జడ్జి. దీంతో వైసీపీ శిబిరంలో సంతోషం.. టీడీపీ శిబిరంలో ఆందోళన.. రెండూ ఏకకాలంలో మొదలయ్యాయి.

అయితే ఇది టీజర్ మాత్రమే అంటున్నారు వైసీపీ నేతలు. అసలు బొమ్మ ముందుందని పరోక్షంగా టీడీపీకి సంకేతాలు పంపిస్తున్నారు. హైకోర్టులో ఇంకా చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని వైసీపీ నేతలు ఈ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించి టీడీపీ వెన్నులో ఆల్రెడీ వణుకు స్టార్ట్ అయిందనేది వాస్తవం.

శాసన వ్యవస్థ మూడు రాజధానుల కోసం చేసిన చట్టాన్ని సైతం హైకోర్టులో సవాల్ చేశాయి ప్రతిపక్షాలు. ఇళ్ల పట్టాల పంపిణీపై కొర్రీలు, ఇంగ్లిష్ మీడియానికి అడ్డుపుల్లల్లాంటివి ఇంకా చాలానే ఉన్నాయి. 

విశాఖలో గెస్ట్ హౌస్ కోసం ఆరా తీస్తే.. రాజధాని తరలించేస్తున్నారు, కోర్టు కేసుల్ని పట్టించుకోవడంలేదంటూ రాద్ధాంతం చేస్తున్నారు. నిర్ణయాల్ని అమలు చేయకుండా ప్రభుత్వం చేతుల్ని కట్టిపడేశారు. వీటన్నింటిపై ఇప్పుడు సమీక్ష జరిగే అవకాశముంది.

కొత్త జడ్జీలు వస్తే.. తమకు ఇబ్బందిగా ఉంటుందని, కేసుల విచారణ మళ్లీ మొదటికొస్తుందని.. జడ్జీల బదిలీలు ఆపాలని గతంలో అమరావతి ముసుగులో కొందరు టీడీపీ నేతలు రాష్ట్రపతిని కూడా ఆశ్రయించారు. అంటే.. జడ్జీలు మారితే నిర్ణయాలు తమకు ప్రతికూలంగా ఉంటాయనే అనుమానం వారిలో ఉందనే విషయం స్పష్టమైంది. 

దానికి టీజర్ గా వచ్చింది స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ను కోర్టు రద్దు చేయడం. ఎన్నికల నోటిఫికేషన్ రద్దుతో ఇప్పటికైతే టీడీపీ నేతలు టీజర్ రుచి చూశారు. పిక్చర్ అభీ బాకీ హై.

దేవుడిపై ప్రేమ ఉన్నట్టుగా డ్రామాలాడుతున్నారు

విక్ర‌మార్కుడు కంటే ప‌వ‌ర్ పుల్

 


×