cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

జ‌గ‌న్ ఆశ‌ల‌పై క‌రోనా నీళ్లు

జ‌గ‌న్ ఆశ‌ల‌పై క‌రోనా నీళ్లు

జ‌గ‌న్ స‌ర్కార్ ఆశ‌ల‌పై మ‌హ‌మ్మారి క‌రోనా నీళ్లు చ‌ల్లింది. న్యాయ‌స్థానంలో త్వ‌ర‌గా మూడు రాజ‌ధానుల‌కు ఓ ప‌రిష్కారం దొరికి, విశాఖ‌కు ఎగ్జిక్యూటివ్ రాజ‌ధాని త‌ర‌లింపు ఎప్పుడెప్పుడా అని త‌హ‌త‌హ‌లాడుతున్న జ‌గ‌న్ స‌ర్కార్‌కు క‌రోనా పెద్ద అడ్డంకిగా మారిందని చెప్పొచ్చు. అమ‌రావ‌తిలో శాస‌న , విశాఖ‌లో ప‌రిపాల‌న, క‌ర్నూలులో న్యాయ‌రాజధానుల ఏర్పాటుకు జ‌గ‌న్ స‌ర్కార్ చ‌ట్టాల‌ను కూడా చేసింది.

అయితే జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ, అమ‌రావ‌తిలోనే రాజ‌ధాని కొన‌సాగించాల‌ని కోరుతూ ప‌లువురు హైకోర్టులో పిటిష‌న్లు దాఖలు చేశారు. దీనిపై చీఫ్ జ‌స్టిస్ మ‌హేశ్వ‌రి నేతృత్వంలోని త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది. అయితే జ‌స్టిస్ మ‌హేశ్వ‌రి బ‌దిలీ కావ‌డం, కొత్త చీఫ్ జ‌స్టిస్ రావ‌డంతో విచార‌ణ క‌థ మ‌ళ్లీ మొద‌టికొచ్చింది.

ప్ర‌స్తుతం మూడు రాజ‌ధానుల కేసును హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఏకే గోస్వామి, జ‌స్టిస్ జోయ్‌మ‌ల్య బాగ్చీ, జ‌స్టిస్ ఎన్‌.జ‌య‌సూర్య‌తో కూడిన త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది. 

చీఫ్ జ‌స్టిస్‌గా ఏకే గోస్వామి బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత ఇటీవ‌లే కేసు విచార‌ణ చేప‌ట్టారు. అయితే క‌రోనా సెకెండ్ వేవ్ ఉధృతి పెరుగుతుండడం, మ‌రోవైపు హైకోర్టులో కొంద‌రు ఉద్యోగులు, న్యాయ‌వాదులు క‌రోనా బారిన ప‌డ‌డం తెలిసిందే.

మూడు రాజ‌ధానుల‌పై నిన్న హైకోర్టులో విచార‌ణ ప్రారంభం కాగానే క‌రోనా తీవ్ర‌త గురించి న్యాయ‌వాదులు ధ‌ర్మాస‌నం దృష్టికి తీసుకెళ్లారు. క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో కోర్టుకు హాజ‌రు కాలేమ‌ని పిటిష‌నర్ల త‌ర‌పు న్యాయ‌వాదులు ధ‌ర్మాస‌నానికి తెలిపారు. వేసవి సెల‌వుల త‌ర్వాత విచార‌ణ జ‌ర‌పాల‌ని కోరారు.

పిటిష‌న‌ర్ల త‌ర‌పు న్యాయ‌వాదుల అభ్య‌ర్థ‌న‌పై అద‌న‌పు అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ (ఏఏజీ) పొన్న‌వోలు సుధాక‌ర్‌రెడ్డి స్పందిస్తూ వాయిదా వేయ‌డంపై అభ్యంత‌రం లేదన్నారు. దీంతో ఆగ‌స్టు 23కు విచార‌ణ వాయిదా వేస్తున్న‌ట్టు ధ‌ర్మాస‌నం ప్ర‌క‌టించింది. దీంతో మూడు రాజ‌ధానుల త‌ర‌లింపు మ‌రింత జాప్యం కానుంది. 

ఆగ‌స్టు నాటికి ప‌రిస్థితులు కుదుట ప‌డి, విచార‌ణ వేగ‌వంత‌మైతే త‌ప్ప ... మూడు రాజ‌ధానులపై స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం లేదు. దీంతో జ‌గ‌న్ స‌ర్కార్‌కు ఎదురు చూపులు ఎంత కాల‌మో చెప్ప‌లేని ప‌రిస్థితి.

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×