Advertisement

Advertisement


Home > Politics - Political News

కరోనా కాటుకు తోడు ఎండ దెబ్బ

కరోనా కాటుకు తోడు ఎండ దెబ్బ

ఓ పక్క కరోనాతో జనం బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పుడు దీనికి తోడు వేసవికాలం తన ప్రతాపం చూపిస్తోంది. అవును.. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఇప్పుడిప్పుడే లాక్ డౌన్ నుంచి మినహాయింపులు ఇస్తుండగా.. బయటకెళ్లి పనులు చేసుకుందామనుకునే కూలీలు ఎండ దెబ్బకు విలవిల్లాడిపోతున్నారు.

నిన్న అదిలాబాద్ లో అత్యథికంగా 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.  నిజామాబాద్ లో 45 డిగ్రీలు, రామగుండం, నల్గొండ, మెదక్ లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ లో నిన్న ఉష్ణోగ్రత 42.3 డిగ్రీలకు చేరుకుంది. సాధారణ ఉష్ణోగ్రతతో పోలిస్తే ఇది 3 డిగ్రీలు ఎక్కువ.  

అటు ఏపీలో కూడా ఎండలు మండిపోతున్నాయి. కర్నూలులో 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. తిరుపతి, అనంతపురం, కడపలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని దాదాపు అన్ని పట్టణాల్లో సాధారణం కంటే 2 డిగ్రీలు ఎక్కువగా ఎండలు పెరిగాయి.

ఎండ దెబ్బకు తెలంగాణలో నిన్న ఒక్క రోజే ఐదుగురు మృతి చెందారు. నిజామాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, వనపర్తి జిల్లాల్లో ఈ మరణాలు చోటు చేసుకున్నాయి. మరో వారం రోజుల పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాలులు వీచే ప్రమాదముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మధ్యాహ్నం 12 దాటిన తర్వాత బయటకు వెళ్లకుండా ఉంటే మంచిదని సూచిస్తున్నారు.

అటు ఏపీలో ఈరోజు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపినప్పటికీ.. ఎండల తీవ్రత మాత్రం తగ్గదని తేల్చేసింది. రాయలసీమ, కోస్తాలోని పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని స్పష్టంచేసింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుంచి వీస్తున్న వేడిగాలుల వల్ల రాష్ట్రం వేడెక్కుతోందని తెలిపారు అధికారులు. 

దేవుడి ఆస్తులను కాజేసింది చంద్రబాబు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?