cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

రాత్రికి రాత్రే ఎలా? హైకోర్టు నిల‌దీత‌

రాత్రికి రాత్రే ఎలా? హైకోర్టు నిల‌దీత‌

మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ కుటుంబం హైకోర్టులో దాఖ‌లు చేసిన అత్య‌వ‌స‌ర పిటిష‌న్ విచార‌ణ సంద‌ర్భంగా న్యాయ‌మూర్తి జ‌స్టిస్ వినోద్‌కుమార్ ప్ర‌భుత్వాన్ని గ‌ట్టిగా నిల‌దీశారు. రాత్రికి రాత్రే స‌ర్వే ఎలా పూర్త‌యింది? ఫిర్యాదు చేస్తే ఎవ‌రి ఇంట్లోకైనా వెళ్లి విచార‌ణ చేయొచ్చా? అని హైకోర్టు నిల‌దీసింది.

అత్యవసర పిటిషన్‌పై నివాసంలోనే న్యాయమూర్తి జస్టిస్‌ వినోద్‌కుమార్‌ విచారణ చేపట్టారు. ఈటల కుటుంబం తరఫున సీనియర్‌ న్యాయవాది దేశాయి ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. 

సర్వే చేసే ముందు తమకు క‌నీసం నోటీసు ఇవ్వలేదని ఈటల కుటుంబం న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. తమ భూముల్లోకి అధికారంలోకి అక్రమంగా చొరబడ్డారని ఈట‌ల కుటుంబం త‌ర‌పు న్యాయ‌వాది తెలిపారు. కలెక్టర్‌ నివేదిక కూడా తమకు ఇవ్వలేదన్నారు.

ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్(ఏజీ) ప్రసాద్ స్పందిస్తూ.... ఈటలపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినందునే విచారణ జరిపామని వాదించారు. వాదనలు విన్న హైకోర్టు ‘సర్వే చేసేందుకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదా? రాత్రికి రాత్రే సర్వే ఎలా పూర్తయింది. ఫిర్యాదు వస్తే ఎవరి ఇంట్లోకైనా వెళ్లి విచారణ చేయొచ్చా?’ అని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది. క‌లెక్ట‌ర్ తీరుపై హైకోర్టు తీవ్ర అభ్యంత‌రం తెలిపింది.

అధికారులు కారులో కూర్చొని నివేదిక త‌యారు చేసిన‌ట్టు కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. అడ్వొకేట్‌ జనరల్ జోక్యం చేసుకుంటూ పిటిషనర్లది కేవలం ఆందోళన మాత్రమేనన్నారు. హైకోర్టు పూర్తి వాద‌న‌లు విన్న త‌ర్వాత త‌దుప‌రి నిర్ణ‌యం ఏమ‌ట‌న్న‌ది తెలియ‌నున్న‌ది.

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×