cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

గేట్స్ దంపతుల విడాకులు.. మెలిందా వాటా ఎంత?

గేట్స్ దంపతుల విడాకులు.. మెలిందా వాటా ఎంత?

ఊహించని విధంగా బిల్ గేట్స్, మెలిందా గేట్స్ విడాకులు తీసుకుంటున్నారు. తమ 27 ఏళ్ల వైవాహిక బంధానికి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నట్టు వీళ్లిద్దరూ సంయుక్తంగా ప్రకటించారు. ప్రపంచ కుబేరుల్లో ఒకరుగా పేరు పొందిన బిల్ గేట్స్.. విడాకుల్లో భాగంగా తన భార్యకు కొంత పరిహారం ముట్టజెప్పాల్సి ఉంటుంది. డైవోర్స్ చట్టాల ప్రకారం.. మెలిందా ఎంత మొత్తం దక్కించుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

(మైక్రోసాఫ్ట్ లో ఉన్న 1.37 శాతం వాటా కలుపుకొని) ఫిబ్రవరి నాటికి బిల్ గేట్స్ సంపాదన 137 బిలియన్ డాలర్లు. ఇక వీళ్లిద్దరూ జాయింట్ గా స్థాపించిన బిల్-మెలిందా గేట్స్ ఫౌండేషన్ విలువ అక్షరాలా 50 బిలియన్ డాలర్లు. ఇవి కాకుండా.. ప్రస్తుతం వీళ్లు నివశిస్తున్న ఇంటి ఖరీదు 140 మిలియన్ డాలర్లు. సియాటిల్ లోని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కు దగ్గర్లోనే, అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఈ ఇల్లు ఉంది.

వాషింగ్టన్ రాష్ట్ర చట్టాల ప్రకారం.. వివాహం జరిగిన తర్వాత చేకూరిన సంపాదనలో భాగస్వాములిద్దరికీ సమాన వాటా ఉంటుంది. విడాకులు తీసుకున్నప్పుడు అప్పటివరకు ఉన్న ఆస్తుల్ని సమానంగా పంచుకోవాల్సిందే. కాకపోతే భార్య లేదా భర్త అనుమతితో మరో భాగస్వామి తన పేరిట కొన్ని ఆస్తుల్ని కలిగి ఉండొచ్చు. విడాకుల సమయంలో ఆ ఆస్తులపై భాగస్వామికి హక్కు ఉండదు. బిల్ గేట్స్, మెలిందాకు అలాంటి వ్యక్తిగత ఆస్తులు ఎన్ని ఉన్నాయనేది ఎవ్వరికీ తెలియదు.

తమ ఆస్తులు, పంపకాలకు సంబంధించి పూర్తి వివరాల్ని సియాటెల్ కింగ్ కౌంటీ సుప్రీంకోర్టుకు సమర్పించారు గేట్స్ దంపతులు. ఉమ్మడిగా ఉన్న ఆస్తుల్ని ఎలా విభజించుకున్నారనే విషయాన్ని అందులో స్పష్టంగా తెలిపారు. కాకపోతే ఆ వివరాలు ఇంకా బయటకు రాలేదు.

ఆర్థిక నిపుణులు అంచనా ప్రకారం.. మెలిందాకు గేట్స్ ఎంత తక్కువ వాటా దక్కించుకున్నప్పటికీ ఆమె ప్రపంచంలోనే అత్యంత ధనిక మహిళల జాబితాలో చేరడం ఖాయం. అమెజాన్ ఫౌండర్ ఉదంతాన్ని వాళ్లు ఉదాహరణగా చెబుతున్నారు. 

భార్య మెకంజీ స్కాట్ నుంచి విడిపోయినప్పుడు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెనోస్, ఆమెకు 36 బిలియన్ డాలర్లు (అమెజాన్ విలువలో 4 శాతం) ఇచ్చాడు. దీంతో ఆమె ప్రపంచంలోనే అత్యంత ధనిక మహిళల్లో మూడో స్థానానికి చేరుకుంది. ఇప్పుడు మెలిందా అంతకంటే మెరుగైన స్థానాన్నే అందుకునే అవకాశం ఉంది. 

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. బిల్-మెలిందా తమ ఆస్తుల్ని సగం సగం పంచుకున్నట్టు తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే ప్రపంచ ధనవంతుల జాబితాలో బిల్ గేట్స్ స్థానం మరింత కిందకు దిగజారిపోతుంది. ఫోర్బ్స్ జాబితా ప్రకారం, ప్రస్తుతం బిగ్ గేట్స్ 4వ స్థానంలో ఉన్నారు.

ఇక పిల్లల విషయానికొస్తే.. బిల్, మెలిందా ఇద్దరూ ఒకేలా ఆలోచించారు. సంతానానికి ఎక్కువ ఆస్తిని వారసత్వంగా ఇవ్వడానికి వాళ్లు ఇష్టపడలేదు. 25, 21, 18 ఏళ్ల వయసున్న ముగ్గురు పిల్లలున్నారు వీళ్లకి. వీళ్ల ముగ్గురికీ చెరో 10 మిలియన్ డాలర్లు చొప్పున ఇవ్వాలని ఈ దంపతులు నిర్ణయించారు. మొత్తం ఆస్తిలో చూసుకుంటే ఇది చాలా చాలా తక్కువ మొత్తం.

ఛారిటీ విషయంలో కూడా ఇద్దరం ఒకేలా ఉంటామని, గేట్స్-మెలిందా ఫౌండేషన్ కొనసాగుతుందని గేట్స్ దంపతులు ప్రకటించినప్పటికీ.. ఛారిటీ కార్యక్రమాలపై ఆ ప్రభావం కచ్చితంగా పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వారెన్ బఫెట్ లాంటి వ్యక్తులు గేట్స్ ఫౌండేషన్ కు ఇప్పటివరకు 29 బిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు. 

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఛారిటీ సంస్థగా కొనసాగుతున్న గేట్స్-మెలిందా ఫౌండేషన్.. రాబోయే రోజుల్లో ఎలా మారుతుందనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకం. 

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×