Advertisement

Advertisement


Home > Politics - Political News

విశాఖ వెనక భారీ కుట్ర?

విశాఖ వెనక భారీ కుట్ర?

కర్మాగారాలు అన్న తరువాత ప్రమాదాలు జరగ‌డం సహజం. దేశంలో చాలా చోట్ల అలా జరుగుతున్నాయి. ముంబై, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్ ఇలా నగరాలు అన్నీ కూడా భారీ పరిశ్రమల మధ్యనే ఉన్నాయి. అంత మాత్రం చేత అక్కడ అభివ్రుధ్ధి ఆపేయాలని లేదు. ప్రమాదాలకు కారణాలు తెలుసుకుని నివారించడమే ఎవరైనా చేసేది, చేయాల్సింది కూడా.

కానీ ఒక్క విశాఖపట్నంలో మాత్రమే ప్రమాదాలు వరసగా జరిగిపోతున్నాయని పెడబొబ్బలు గగ్గోలు మొదలైంది. అది కూడా ఏడాది మాత్రమే పూర్తి అయిన జగన్ పాలన మీద బురద జల్లుతూ ప్రమాదాలు అన్నీ సర్కార్ వైఫల్యాలుగా కట్టేయడం వెనక కుట్ర దాగిఉందని వైసీపీ నేతలు అంటున్నారు. 

దీనికంతటికీ కారణం విశాఖను రాజధానిగా జగన్ సర్కార్ ప్రకటించడమే. అందుకే విశాఖలో ఏదో జరిగిపోతోందని, ఇక్కడ భద్రత ప్రశ్నార్ధకమని కధనాలు వండి వారుస్తున్న అనుకూల మీడియా ఓ వైపు వీరంగం ఆడుతూంటే దానికి తందానా అంటూ తమ్ముళ్ళు రెచ్చిపోతున్నారు.

విశాఖ రాజధాని అని జగన్ అనకపోయి ఉంటే ఈ ప్రమాదాలు అన్నీ కూడా అతి సాధారణమైనవిగా మారిపోతాయి కూడా. సరే విశాఖ సేఫెస్ట్ సిటీ కాదని అంటున్నారు, దాన్నే ఒప్పుకుందాం, కానీ ఎక్కడ అభివ్రుధ్ధి ఉంటే అక్కడ పరిశ్రమలు ఉంటాయి కదా. ఆ లెక్కన చెన్నై, ముంబై, బెంగుళూర్ వంటి సిటీలు కూడా సేఫెస్ట్ కాదని విపక్షాలు చెప్పదలచుకున్నాయా అన్నదే ఇక్కడ ప్రశ్న.

విశాఖకు తరచూ  తుఫాన్లు వస్తాయి, సునామీలు, హూదూద్ బీభత్సాలు వస్తాయి అని ఇంతకాలం చెప్పిన వారు ఇపుడు గ్యాస్ లీకేజ్ ప్రమాద‌ ఘటనలనూ వాడేసుకుంటున్నారు. మరి ఒకనాటి పల్లెకారు చిన్న వూరు విశాఖ ఇపుడు పాతిక ముప్పయి లక్షల జనాభా కలిగిన మెట్రో సిటీగా ఎలా ఎదిగింది. అభివ్రుధ్ధి జరగకపోతే విశాఖ ఆసియా ఖండంలోనే శరవేగంగా ఎదిగే పరిస్థితి ఉండేదా.

అటువంటి మెట్రో సిటీని పరిపాలనారాజధాని చేస్తామంటే ఎక్కడ లేని రాజకీయాలూ చేస్తున్న విపక్ష రాజకీయాన్ని, పచ్చపాత రాజనీతిని ఏమని వర్ణించాలి. ఈ దుర్నీతిని ఎలా అభివర్ణించాలి. మొత్తానికి కుట్ర, కుత్సిత రాజకీయాల మాటున విశాఖ ప్రగతి నలిగిపోతోందంటే సబబుగా ఉంటుందేమో.

కోహ్లీ.. గాలిలో చప్పట్లతో

ఉషారాణికి అండగా మంత్రి అనిల్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?