Advertisement

Advertisement


Home > Politics - Political News

అమ్మేయండి బాస్.. ఉన్నదంతా పోగొట్టుకోండి

అమ్మేయండి బాస్.. ఉన్నదంతా పోగొట్టుకోండి

అమ్మేయండి బాస్.. అంటూ కొన్నేళ్ల కిందట అల్లు అర్జున్ తెగ ఊరించాడు. ఓఎల్ఎక్స్ ముచ్చట ఇది. పాతది ఏదైనా ఇందులో ఈజీగా అమ్మేయొచ్చు అనేది కాన్సెప్ట్. కానీ ఇప్పుడు ఇదే ఓఎల్ఎక్స్ సైబర్ నేరగాళ్లకు అడ్డాగా మారింది. ఎంతలా అంటే.. ఏకంగా సైబర్ క్రైమ్ పోలీసులు ఈ సైట్ ను బ్యాన్ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసే స్థాయికి ఎదిగింది ఈ వెబ్ సైట్.

అవును..  ఓఎల్ఎక్స్ లో అమ్మకాలు-కొనుగోళ్లు చేయొద్దని స్వయంగా సైబర్ క్రైమ్ పోలీసులే చెబుతున్నారు. ఈ సైట్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిథిలో ఓఎల్ఎక్స్ మోసాలు రోజుకు 10కి పైగా నమోదవుతున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ సైట్ ను బ్యాన్ చేయాలని కోరుతున్నారు పోలీసులు.

ఒకప్పుడు ఓఎల్ఎక్స్ లో ఏదైనా అమ్మాలన్నా, కొనాలన్నా ఫేస్ టు ఫేస్ జరిగేది. ఓ వ్యక్తి, మరో వ్యక్తిని కలిసి వస్తువును చెక్ చేసుకొని, చేతికి డబ్బులిచ్చి తీసుకెళ్లేవాడు. కానీ ఎప్పుడైతే ఆన్ లైన్  వాడకం ఎక్కువైందో, అప్పుడే ఆన్ లైన్ మోసాలు కూడా ఎక్కువయ్యాయి.

ఓ క్యూఆర్ కోడ్ పంపించి దాన్ని స్కాన్ చేస్తే మీ ఎకౌంట్ లోకి డబ్బులు పడతాయని, మీ ఎకౌంట్ లో డబ్బులు పడిన వెంటనే ఇంటికొచ్చి వస్తువు తీసుకెళ్తామని చెబుతారు. ముందే డబ్బులు వస్తున్నాయనే ఆశతో చాలామంది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల మన ఎకౌంట్ లో డబ్బులు పడడం కాకుండా, మన ఎకౌంట్ నుంచి అవతలి వ్యక్తి (సైబర్ నేరగాడు) ఖాతాలోకి డబ్బులు వెళ్లిపోతున్నాయి.

ఎక్కువమంది ఇలానే మోసపోతున్నారని చెబుతున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. గమ్మత్తైన విషయం ఏంటంటే.. మొదటిసారి ఏదో పొరపాటు జరిగిందని, మరోసారి ట్రై చేయమని చెప్పి మళ్లీ మళ్లీ అదే ఫార్ములాలో డబ్బులు కొట్టేస్తున్నారు కేటుగాళ్లు. హైదరాబాద్ పరిథిలోనే గడిచిన ఐదేళ్లలో ఓఎల్ఎక్స్ లో వంద కోట్ల రూపాయల వరకు సైబర్ మోసాలు జరిగాయని పోలీసులు చెబుతున్నారు.

సో.. ఆన్ లైన్ లో ఏదైనా అమ్మాలన్నా కొనాలన్నా ఇకపై మరింత జాగ్రత్త అవసరం.

సిక్స్ ప్యాక్ లో నాగ శౌర్య

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?