cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

కరోనా అప్ డేట్ ఇచ్చిన అల్లు అర్జున్

కరోనా అప్ డేట్ ఇచ్చిన అల్లు అర్జున్

కొన్ని రోజుల కిందట హీరో అల్లు అర్జున్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి హోం ఐసొలేషన్ లో ఉన్న బన్నీ.. ఇప్పుడు తాజాగా తన ఆరోగ్య స్థితిపై స్పందించాడు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టంచేశాడు.

"హాయ్.. నేను బాగానే ఉన్నాను. స్వల్పంగా లక్షణాలున్నాయంతే. బాగానే కోలుకుంటున్నాను. కంగారు పడాల్సిన పనిలేదు. ఇంకా నేను క్వారంటైన్ లోనే ఉన్నాను."

ఇలా తానికింతా క్వారంటైన్ లో ఉన్న విషయాన్ని తెలియజేశాడు అల్లు అర్జున్. తన ఆరోగ్యం గురించి వాకబు చేసిన వాళ్లందరికీ మరోసారి ధన్యవాదాలు తెలిపాడు. పుష్ప షూటింగ్ లో వైరస్ బారిన పడ్డాడు బన్నీ. ఆ వెంటనే సినిమా షూటింగ్ ఆపేశారు.

ఓవైపు కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ, భారీ యూనిట్ తో పుష్ప షూటింగ్ జరిపారు ఆమధ్య. అప్పుడే చాలామంది అనుమానం వ్యక్తంచేశారు. అనుకున్నట్టుగానే బన్నీకి వైరస్ సోకింది. యూనిట్ లో మరికొందరు కూడా వైరస్ బారిన పడ్డారు. ముందుజాగ్రత్త చర్యగా దర్శకుడు సుకుమార్ కూడా ఐసొలేషన్ లోకి వెళ్లిపోయారు.

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×