cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

ఇది సరికాదు రెడ్డిగారూ

ఇది సరికాదు రెడ్డిగారూ

ఆలయ ధర్మకర్త అంటే దేవుడి గుడి ఆలన పాలన చూడడం మాత్రమే కాదు. దేవుడి సొమ్మును పదిలంగా కాపాడాలి కూడా. ముఖ్యంగా తిరుమల తిరుపతి వెంకన్న అంటే ప్రపంచ వ్యాప్తంగా వున్న హిందువుల మనోభావాల్లో కొలువై వున్న దేవుడు. అక్కడ చీమ చిటుక్కు మంటే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి. ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ కావచ్చు, ఇతర పాలక మండలి సభ్యులు కావచ్చు గుర్తించాలి. 

టీటీడీ నిధులు కాస్త అధిక వడ్డీ కోసం ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టొచ్చు అన్న నిర్ణయంపై అప్పుడే మీడియా నుంచి వ్యతిరక వార్తలు ప్రారంభమయ్యాయి. ఆ మీడియా తెలుగుదేశానికి అనుకూలమా? వ్యతిరేకమా? అన్నది పక్కన పెట్టి, అది లేవనెత్తిన పాయింట్లు సరైనవా? కావా? అన్నది చూడాలి.

మీడియా కథనం ప్రకారం విషయం ఇలా వుంది.

1.బ్యాంకుల వడ్డీ రేట్లు తగ్గాయి కాబట్టి ప్రభుత్వ సెక్యూరిటీల్లొ నిధులు వుంచవచ్చు అని ఆర్థిక కమిటీ సిఫార్సు చేసింది.

2. ఆర్థిక కమిటీ కేంద్ర సెక్యూరిటీలు అని సలహా ఇస్తే రాష్ట్ర సెక్యూరిటీలు అన్న పదం వచ్చి చేరింది.

3.బ్యాంకుల్లో వుంచి నిధులపై వడ్డీతో పథకాలు అమలు అవుతాయి కాబట్టి, ఆ నిధులు చాలడం లేదు కాబట్టి బ్యాంకులకు బదులు సెక్యూరిటీలను ఎంచుకోవాలన్నది పాయింట్.

ఇక్కడే చాలా అభ్యంతరాలు వున్నాయి. ఎందుకంటే బ్యాంకుల్లో నిధులు వుంటే అవసరమైతే క్షణాల్లో వెనక్కు తీసుకోవచ్చు. పైగా నెల నెలా వడ్డీ వచ్చే వెసులుబాటు వుంటుంది. పైగా మరీ లాంగ్ టెర్మ్ డిపాజిట్ చేయనక్కరలేదు.

కానీ రాష్ట్ర లేదా కేంద్ర సెక్యూరిటీలు అంటే అలా కాదు. బాగా అంటే బాగా లాంగ్ టెర్మ్ డిపాజిట్ చేయాల్సి వుంటుంది. టెర్మ్ కాలంలో డిపాజిట్ ముట్టుకోవడానికి లేదు. 

పైగా నెల నెలా వడ్డీ రాదు. మధ్యలో డిపాజిట్ లు వెనక్కు తీసుకోవడం సాధ్యం కాదు.

అన్నింటికి మించి చైర్మన్ ఎవరైనా, ప్రభుత్వం ఏదయినా, దేవుడికి అనుకూలంగా నిర్ణయం తీసుకోలేరు. ఎందుకంటే ప్రభుత్వం డబ్బులు వెనక్కు ఇవ్వడానికి సానుకూలంగా వుండదు. ప్రభుత్వం నిర్ణయించిన చైర్మన్, కమిటీ ఎప్పటికీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేయలేవు. 

ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబఢులు పెడితే కొన్ని కోట్లు అదనంగా రావచ్చు. ఎందుకంటే ఓ ఒకటి లేదా ఒకటిన్నర శాతం వడ్డీ అదనంగా వుంటే వుండొచ్చు.

కానీ డిపాజిట్ల మీద టీటీడీ నియంత్రణ పూర్తిగా వుండకుండా పోతుంది. అందువల్ల దేవుడి డబ్బులతో గేమ్స్ ఆడకుండా వుంటే మంచిది రెడ్డిగారూ.

ఈనాడు,జ్యోతి ప‌ట్టించుకోలేదు 

 


×