Advertisement

Advertisement


Home > Politics - Political News

ఇంత సంక్షోభం బాబు టైమ్ లో వచ్చి ఉంటే..?

ఇంత సంక్షోభం బాబు టైమ్ లో వచ్చి ఉంటే..?

కరోనా కష్టకాలంలో అదృష్టవశాత్తు ఏపీకి జగన్ సీఎంగా ఉన్నారు. ఇదే విపత్తు చంద్రబాబు టైమ్ లో వచ్చి ఉంటే.. ఆ ఘోరాలు చూడలేక జనం కరోనా కంటే ముందే బాబు దెబ్బకి బలైపోయేవారు. కరోనా విలయంలోనూ జగన్ సైలెంట్ గా తన పని తాను చేసుకుని పోతున్నారు. తబ్లిగీ సంఘటన జరక్కపోయి ఉంటే.. దక్షిణ భారత దేశంలో అత్యల్ప కేసులు మన రాష్ట్రంలోనే ఉండేవేమో.

కరోనా కేసులు ఒక్కసారి భారీగా పెరిగినా కూడా జగన్ పట్టు సడలకుండా కేవలం కార్యాచరణపైనే దృష్టిపెట్టారు. హడావిడి చేయడంలేదు, ఎక్కడ ఏది అవసరమో అదే చేస్తున్నారు. వివరాలన్నిటినీ పారదర్శకంగా వెల్లడిస్తున్నారు, అధికారులకు మార్గదర్శకత్వం చేస్తున్నారే తప్ప ఎవ్వర్నీ టెన్షన్ పెట్టడంలేదు.

ఈ పరిస్థితుల్లో చంద్రబాబు సీఎంగా ఉంటే.. ఎలా ఉండేదో ఓసారి ఆలోచించండి. బాబే సీఎంగా ఉంటే.. ఈ పాటికి  రాష్ట్రమంతా హోర్డింగ్ లు వెలిసేవి, రియల్ టైమ్ గవర్నెన్స్ అంటూ ఓ రేంజ్ లో హడావిడి చేసేవారు. వార్ రూమ్, పీస్ రూమ్ అంటూ అక్కడే తిని, అక్కడే నిద్రపోతూ.. మీడియాకి మంచి మసాలా వార్తలు అందించేవారు. చేసే పని తక్కువ, సమీక్షలు ఎక్కువ అయ్యేవి.

అధికారుల్ని వేధించుకుని తినేవారు. ఉదయం అరగంట, సాయంత్రం అరగంట.. ఆడియో/వీడియో కాన్ఫరెన్స్ లు జరిగేవి. కాల్ కట్ చేస్తే పాపం అన్నట్టు, ఎప్పుడెవర్ని లైన్లోకి తీసుకుంటారో తెలియక, అధికారులందరూ ఆ గంటసేపు ఫోన్లు వదిలి ఎక్కడికీ కదిలేవారు కాదు. పనిచేయాలనే ఉత్సాహం ఉన్నవాళ్లను కూడా చేతులు కట్టేసి వీడియో కాన్ఫరెన్స్ రూమ్ లో కూర్చోబెట్టేవారు బాబు.

ఇక పారదర్శకత అనే అంశం పూర్తిగా బ్రహ్మపదార్థంగా మారిపోయేది. అనుకూల మీడియాలో ఒకలా, మిగతా మీడియాలో మరోలా... అంతా షో నడిచేది. కరోనాని తరిమికొట్టిన బాబు, కష్టకాలంలో ప్రజల కోసం బాబు, కరోనాని ఎదురొడ్డి ఎదుర్కొన్న బాబు, కరోనా విషయంలో ప్రపంచానికే ఆదర్శంలా నిలిచిన బాబు.. ఇలాంటి హెడ్డింగ్ లు, హెడ్ లైన్లు ఎన్ని చూడాల్సి వచ్చేవో. ఇంత జరుగుతున్నా మరోవైపు చాప కింద నీరులా చీకటి జీవోలు పాస్ అయిపోతుండేవి.

ఇక పీఎం సహా.. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతినిధులతో చంద్రబాబు కచ్చితంగా సమీక్షలు జరిపేవారు. ఆస్పత్రుల్లో కూడా హడావిడి తప్ప ఇంకేమీ ఉండేది కాదు. బాబుగారి సైన్యం.. గంటకోసారి హెల్త్ బులిటెన్లు అప్ డేట్ చేసేది, ఆ బులిటెన్లతోటే కరోనా పోయినట్టు మసిపూసి మారేడుకాయ చేసేది. సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవాలంటూ చంద్రబాబు చెప్పే కబుర్లకు అంతూ పొంతూ ఉండేది కాదు. పనిలో పనిగా ప్రతిపక్షాలు పనిచేయడంలేదంటూ, సహకరించడం లేదంటూ.. అక్కడ కూడా రాజకీయాలు చేసేవారు.

అప్పటికి మోదీతో సానుకూలత ఉంటే.. ఆయన దేవుడనేవారు, దీపాల కాన్సెప్ట్ బ్రహ్మాండం అని పొగిడేవారు. ఎన్డీఏ నుంచి బైటకి వచ్చేసిన టైమ్ లో కరోనా వచ్చి ఉంటే.. మోదీకి ఏమీ తెలియదని, రాష్ట్రానికి సహకరించడంలేదని నిందలు మోపేవారు. ఇక ఫినిషింగ్ టచ్ కరోనా హుండీ. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ముందు పచ్చ బ్యాచ్ ఓ హుండీ తయారు చేసేది. చంద్రబాబు సింపతి కోసం జోలెపట్టి కరోనా నిధులు సేకరించేవారు. అమరావతి కోసం ఆన్ లైన్ లో ఇటుకలు డొనేట్ చేసినట్టు.. కరోనా టైమ్ లో మాస్క్ లు విరాళమిచ్చే కాన్సెప్ట్ వచ్చేది. ఒక్కో మాస్క్ రేటు వెయ్యి రూపాయలు ఫిక్స్ అయ్యేది. ఈ విరాళాలు ఎక్కడికెళ్లాయి, దేనికోసం వాడారు అనే విషయంలో మాత్రం స్పష్టత ఉండదు.

ఇక విదేశాల్లో, వివిధ రాష్ట్రాల్లో ఉన్న కరోనా రోగుల్ని పరామర్శించడానికి బాబు ప్రత్యేక విమానాల్లో తిరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బాబు అధికారంలో లేరు కాబట్టి మనం బతికిపోయాం కానీ.. లేకపోతే ఎన్ని ఘోరాలకు ఏపీ ప్రజలు సజీవ సాక్ష్యంగా నిలిచేవారో..!

ఈ లాక్ డౌన్ పెంచమని మోదీగారిని కోరతాను

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?