cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

జగన్ ఓడితే ప్రజలు ఓడినట్టే!

జగన్ ఓడితే ప్రజలు ఓడినట్టే!

ఈ కరోనా టైంలో జగన్ను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని పచ్చ మాఫియా వికృత చేష్టలు చేస్తున్నది. ఏపీలో జగన్ ప్రభుత్వం కరోనాను ఎదుర్కవడానికి చేస్తున్న చర్యలను చూసి, పెద్ద మనసుతో తను పడుతున్న తాపత్రాయన్ని చూసి 50 లక్షల పైగా ప్రజలు తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు ఆంధ్రాకు వచ్చి వైరస్ కమ్యూనిటీ స్ప్రెడ్ అయ్యేందుకు కారణమయ్యారు. అయినా మొక్కవోని ధైర్యంతో జగన్ పోరాడుతున్నాడు. కానీ, సాయం చెయ్యాల్సిన ప్రతిపక్షాలు ప్రజలకు ఏమీ చెయ్యకుండా జగన్ను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని, ఆయన వైఫల్యం చెందాడని చూపటానికి తహతహలాడుతున్నాయి.

1088 అంబులెన్సులు, వందల బస్సులను టెస్టింగ్ సెంటర్లుగా మార్చి దేశంలో ఎక్కడాలేని విధంగా అత్యధిక కరోనా టెస్టులు చేయడం, రోగులందరికీ ఎదో విధంగా చికత్స చేయడం, అంతక మించి అత్యంత ముఖ్యమైన ధైర్యం ఇవ్వడం - ఒక మనసున్న మారాజుగా పాలన చేస్తుంటే ప్రతిపక్షాలు, అను(కుల) మీడియా, మేధావులు రంధ్రాన్వేషన చేస్తూ తమ శాడిజం చూపిస్తున్నారు.

ఒక్కొక అంబులెన్సులో ఒకరికంటే ఎక్కువమంది కరోనా పేషంట్స్ ను ఎక్కిస్తున్నారనే ఈ పెద్దమనుషులు అసలు జగన్ తెచ్చిన ఇన్ని అంబులెన్సులు లేకపోతే అసలు పరిస్థితి ఎలా ఉండేదో అనే ఆలోచన చేస్తున్నారా? ఒక్కొక్క రాజకీయ నాయకుడికి రెండో మూడో కార్లు ఉంటాయి కదా ప్రభుత్వానికి ఈ కరోనా గడ్డు సమయంలో ఒక కారు, డ్రైవర్ని ఇచ్చి సాయం చేస్తున్నారా? తోటి మనుషుల్ని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరంగా అల్లాడిస్తున్న కరోనా వైరస్ బాధలు పెడుతుంటే మంటలు పెంచి చలిగాల్చుకోవాలని చూసే ఈ ప్రతిపక్షాలను అసహ్యించుకోవడం తప్ప ఇంకేమీ చెయ్యగలం?

సోనూ సూద్ చేస్తున్న మంచి పనులను చూసి కూడా "రియల్ మెన్ ఛాలెంజ్' అని మన తెలుగు సినిమా హీరోలు చేస్తున్న చెత్త విడియోలు ప్రజలకు విరక్తి తెప్పిస్తాయి. వాళ్ళ ఇళ్లలో వంటలో సాయపడటం, ఇల్లు క్లీనింగ్ లో హెల్ప్ చెయ్యడం రియల్ మెనా? స్వచ్చ భారత్ అని అప్పట్లో చీపురు పట్టుకుని ఫోటోలు వీడియోలు దిగినట్టు గానే ఇప్పుడు ఈ కరోనా టైంలో ఈ వికృత చేష్టాలేంటి? తలా ఒక అంబులెన్స్ ఏపీకి తెలంగాణాకు కొనివ్వలేక పోయారా? పోనీ కనీసం వైరస్ పైన పబ్లిక్ అవేర్నెస్ కోసమన్నా ప్రయత్నం చేశారా? ఎంతసేపు స్వార్థం, తామేదో ఎక్కడినుండో ఉాడిపడ్డాం అనే భావన!

జగన్ పైన పోరాటం ఆపి కరోనా వైరస్ పైన ఆయన చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వండి కొంచేమన్నా మానవత్వం మీలో ఉంటే చంద్రబాబు అండ్ కో!! కరోనా రక్కసికి మీరు కూడా తొడయ్యి రాష్ట్ర ప్రజలకు వేధించకండి దయచేసి!! సాయం చెయ్యకపోయినా కనీసం రాక్షసులలా జగన్ గారు చేస్తున్న మంచి పనులపైన బండలు వేయకండి!!

గురవా రెడ్డి, అట్లాంటా