Advertisement

Advertisement


Home > Politics - Political News

కరోనా టెర్రర్.. కేసులు-మృతులు రెండూ పెరిగాయ్

కరోనా టెర్రర్.. కేసులు-మృతులు రెండూ పెరిగాయ్

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు పాత రికార్డులు చెరిపేస్తూ కేసుల్లో కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. అటు రోజువారీ మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరగడంతో.. పరిస్థితి ఇప్పుడు మరింత ఆందోళనకరంగా మారింది. గడిచిన 24 గంటల్లో దేశంలో ఏకంగా 7964 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక రోజులో ఇన్ని కేసులు నమోదవ్వడం ఇదే అత్యథికం. ఒక రోజులో 7 వేలకు పైగా కరోనా కేసులు నమోదవ్వడం వరుసగా ఇది రెండోసారి.

తాజా ఫలితాలతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 173,763కు చేరుకుంది. అటు మరణాలు కూడా అత్యథికంగా నిన్ననే చోటుచేసుకున్నాయి. 24 గంటల్లో ఏకంగా 265 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4971కు చేరుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 82,369 మంది డిశ్చార్జ్ అవ్వగా.. 86వేల మందికి పైగా చికిత్స అందుతోంది.

మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 62వేలు దాటింది. అటు తమిళనాడులో కేసుల సంఖ్య 20వేలు దాటగా.. ఢిల్లీలో 17,368, గుజరాత్ లో 15,934 కేసులు నమోదయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 60 లక్షలు దాటింది. ఇప్పటివరకు వివిధ దేశాల్లో 3లక్షల 66వేల మందికి పైగా మరణించారు. ఒక్క అమెరికాలోనే నిన్నటి వరకు 104,542 మంది మృతిచెందారు.

అసలు విషయం మర్చిపోయిన చంద్రబాబు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?