cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

పవన్ కల్యాణ్ కి ఘోర అవమానం

పవన్ కల్యాణ్ కి ఘోర అవమానం

హీరో పవన్ కల్యాణ్ తనని తాను పెద్ద మేధావిగా భావిస్తుంటారు. అంతకు మించి కేంద్రంలో తనకు పెద్ద పలుకుబడి ఉందని కూడా ఊహించుకుంటారు. అయితే అలాంటి ఊహలన్నిటికి ఇప్పుడు చెక్ పడింది. కనీసం పవన్ ని కేంద్రం లెక్కలోకి కూడా తీసుకోలేదని తాజా ఉదాహరణలో తేలిపోయింది.

75వ స్వాతంత్ర దినోత్సవాల కోసం ఏర్పాటుచేసిన జాతీయ కమిటీలో పవన్ కల్యాణ్ కి చోటు దక్కలేదు. ఆఖరికి చంద్రబాబుకి కూడా అందులో స్థానం దక్కడం విశేషం. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్, గవర్నర్ బండారు దత్తాత్రేయ సహా రామోజీరావు, కృష్ణ ఎల్ల, పుల్లెల గోపీచంద్, పీవీ సింధు.. తదితరులకు ఈ కమిటీలో స్థానం దక్కింది. తెలుగు సినీ రంగం నుంచి కేవలం రాజమౌళిని మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు.

ఓవరాల్ గా సినిమా ఇండస్ట్రీని పరిగణలోకి తీసుకుంటే, అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, ఇళయరాజా, ప్రభుదేవా.. ఇలా ఈ లిస్ట్ బారెడు ఉంది. మొత్తం దేశవ్యాప్తంగా 259 మంది ప్రముఖులకు ఇందులో చోటు దక్కింది. విచిత్రంగా అటు రాజకీయం, ఇటు సినిమా రంగాల నుంచి ఉమ్మడిగా ఉన్న పవన్ కల్యాణ్ ని మాత్రం కేంద్రం మరచిపోయింది.

పవన్ ని పక్కన పెట్టినట్టేనా..?

2014 ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ కి ప్రధాని మోదీ మంచి ప్రయారిటీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రచారానికి వచ్చిన సందర్భంలోనే కాదు, ఢిల్లీలోనూ పవన్ కి మర్యాదలు బాగానే జరిగేవి. ఆ తర్వాత టీడీపీ అండ చూసుకుని బీజేపీపై సెటైర్లు వేసి అందరికీ దూరమయ్యారు పవన్. ఆ తర్వాత మళ్లీ బీజేపీతో కలిసినా కూడా గడపదాటిన భార్యలాగానే పవన్ ని ట్రీట్ చేశారు మోదీ. ప్రధానికి ఎన్ని స్త్రోత్రాలు చేసినా ఫలితం లేకపోయింది.

రెండోసారి పొత్తు తర్వాత ప్రధాని మోదీతో ఇంతవరకు పవన్ కి అపాయింట్ మెంట్ దొరకలేదంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అటు జీహెచ్ఎంసీలో పోటీకి అవకాశమివ్వలేదు, ఇటు తిరుపతిలో ఇస్తారనే నమ్మకం లేదు. స్థానిక ఎన్నికల్లో పొత్తు విషయంలో కూడా ఎటూ తేల్చకుండా ఒంటరిగానే ఎవరికి వారే పోటీ చేస్తున్నారు. బీజేపీ, జనసేన మధ్య గ్యాప్ పెరుగుతోందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో కమిటీలో చాలామందికి అవకాశమిచ్చి పవన్ ని మాత్రం మరచిపోయారంటే బీజేపీ దృష్టిలో జనసేనాని ఎంత పలుచన అయ్యారో అర్థమవుతోంది.

ఇటీవల పవన్ కూడా తనకు తానే బీజేపీకి దూరం జరుగుతున్నట్టుంది. కరోనా టైమ్ లో దీపాలు వెలిగించి, గంటలు కొట్టి రెచ్చిపోయిన పవన్, టీకా వచ్చే సమయానికి కేంద్రం తీసుకున్న చర్యలపై ఒక్క ట్వీట్ కూడా వేయలేదు. కనీసం ప్రధాని మోదీ టీకా తీసుకుంటున్న ఫొటోని కూడా షేర్ చేయలేదు. పవన్ దూరం జరుగుతుండటం గమనించిన కేంద్రం.. ఆయన్ని మరింత దూరంగా నెట్టేస్తుందనే మాట మాత్రం వాస్తవం. 

హైకోర్టుకు నిమ్మ‌గ‌డ్డ సారీ

లోకేశ్ ప్ర‌తిమాట ఆణిముత్య‌మే

పవన్ కళ్యాణ్ కి రెస్పెక్ట్ తీసుకొచ్చే సినిమా

నా పుట్టినరోజున లాహే లాహే పాట పాడాను

 


×