cloudfront

Advertisement


Home > Politics - Political News

ఇంటిలిజెన్స్ సర్వే నిజమేనా?

ఇంటిలిజెన్స్ సర్వే నిజమేనా?

కన్ ఫర్మ్ గా ఇంటిలిజెన్స్ సర్వే అని చెప్పలేము, కానీ ఇదీ ఏపీ ఇంటిలిజెన్స్ సర్వే అంటూ ఒక పోస్ట్ వాట్స్ అప్ లో చలామణీ అవుతోంది. అయితే ఇలా చాలా పోస్టులు అటు ఇటు వాట్సాప్ లో తిరుతున్నాయి. కానీ ఈ పోస్ట్ కాస్త ఆసక్తికరంగా వుండడం విశేషం. ఈ పోస్ట్ ప్రకారం వైకాపాకు 120 స్థానాలకు పైగానే వస్తాయని అంచనా వేస్తున్నారు.

నియోజకవర్గాల వారీగా ఏపార్టీ గెలుస్తుంది అన్నది క్లియర్ గా ఇచ్చిన ఈ పోస్ట్ పూర్తిగా వైకాపా వాళ్ల సృష్టి అని అనుకుందాం అంటే, ధర్మాన ప్రసాదరావు, అవంతి శ్రీనివాస్, కోలగట్ల వీరభద్రస్వామి, రోజా, లాంటి వాళ్లు ఓడిపోతారు, ఆ సీట్లలో తెలుగుదేశం గెలుస్తుంది అని లెక్కకట్టారు.

అలాగే వైజాగ్ సౌత్, వెస్ట్, ఈస్ట్ మూడుచోట్లా తెలుగుదేశమే గెలస్తుందని పేర్కొన్నారు. గాజువాకలో పవన్ గెలుస్తాడని లెక్క కట్టారు. నరసాపురం, ఉండి, తణుకు, తాడేపల్లి గూడెం, దెందులూరు, ఏలూరు ఇవన్నీ టీడీపీనే గెల్చుకుంటుందని పేర్కోన్నారు. 

ఆంధ్రలోని శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, అలాగే రాయలసీమలోని ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, కడప ప్రాంతాల్లో ఎక్కువగానూ, మిగిలిన చోట్ల పోటాపోటీగా వైకాపా సీట్లు గెలుచుకుంటుదని ఆ పోస్ట్ లో పేర్కోన్నారు. తాడిపత్రి, పూతలపట్టు, నగిరి, పుట్టపర్తి, పెనుగొండ, హిందూపూర్, కళ్యాణదుర్గం, అనంతపూర్ అర్బన్, తాడిపత్రి, కుప్పం, చిలకలూరి పేట, గుంటూరు వెస్ట్, తెనాలి తెలుగుదేశం ఖాతాలో వేసారు.

ఓ పది స్థానాల వరకు నమ్మేదిగా అనిపించడం లేదు కానీ, టోటల్ గా చూసుకుంటే కాస్త నమ్మేలా తయారుచేసారు ఈ సర్వేను. మరి ఇంటిలిజెన్స్ సర్వేనో, ఎవరి సృష్టి అనేదో మాత్రం తెలియదు.

వార్ వన్ సైడే.. నా? ఎవరి లెక్కలు వారివి!